IPL 2020: రైనా స్థానాన్ని ఆ గన్‌ ప్లేయర్‌తో భర్తీ: వాట్సన్

IPL 2020: రైనా స్థానాన్ని ఆ గన్‌ ప్లేయర్‌తో భర్తీ: వాట్సన్
x

సురేష్ రైనా 

Highlights

IPL 2020: ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 మ‌రో వారం రోజుల్లో ప్రారంభం కానున్న‌ది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు స‌న్న‌హ‌క మ్యాచ్లుల్లో త‌లమున‌క‌లై ఉన్నాయి.

IPL 2020: ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 మ‌రో వారం రోజుల్లో ప్రారంభం కానున్న‌ది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు స‌న్న‌హ‌క మ్యాచ్లుల్లో త‌లమున‌క‌లై ఉన్నాయి. ఈ త‌రుణంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సురేశ్ రైనా స్థానాన్ని భర్తీ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అత‌ని స్థానంలో ఎవ్వ‌రిని తీసుకోవాల‌ని ఆలోచిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ.. రైనా రీఎంట్రీ ఇస్తాడని ఆయ‌న అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. కాగా, తాజాగా సీఎస్‌కే ఆల్‌ రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ చేసిన వ్యాఖ్యలు రైనా ఇక సీఎస్‌కేతో కలిసే అవకాశం లేదనే దానికి బలం చేకూరుస్తోంది. రైనా స్థానాన్ని ఒక గన్‌ ప్లేయర్‌తో పూడుస్తామంటూ వాట్సన్‌ చెప్పుకొచ్చాడు. సురేశ్‌ రైనా లేకపోవడం జట్టుకు అతిపెద్ద లోటైనప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక క్రికెటర్‌ను సిద్ధం చేశామన్నాడు. "రైనా ప్లేస్‌ భర్తీ చేయడానికి ఒక గన్‌ ప్లేయర్‌ను అన్వేషించాం. అతను మురళీ విజయ్‌. గత కొన్నేళ్ల నుంచి మురళీ విజయ్‌కు అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. ఇప్పుడు రైనా స్థానాన్ని విజయ్‌ భర్తీ చేస్తాడని ఆశిస్తున్నాను. అతనొక గన్‌ ప్లేయర్‌." అని షేన్‌ వాట్సన్ వ్యాఖ్యానించారు.

గత నెల చివర్లో వ్యక్తిగత కారణాలతో రైనా ఐపీఎ‌ల్‌కి దూరమయ్యారు. కరోనా ఆ భయంతోనే రైనా యూఏఈ నుంచి వచ్చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే చెన్నై టీమ్‌కే చెందిన సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఐపీఎల్ 2020కి దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు. మొత్తంగా.. ఇప్పుడు ఈ ఇద్దరి స్థానాల్ని ఎవరితో భర్తీ చేయాలి..? అనే ఆలోచనలో చెన్నై ఫ్రాంఛైజీ పడిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories