IPL 2020: న్యూజెర్సీతో రంగంలోకి దిగ‌నున్న‌ ఢిల్లీ వారియ‌ర్స్‌

IPL 2020:  న్యూజెర్సీతో రంగంలోకి దిగ‌నున్న‌ ఢిల్లీ వారియ‌ర్స్‌
x

 IPL 2020: Delhi Capitals (DC) unveil their new jersey  

Highlights

IPL 2020: ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ జ‌ట్టు ఒక్క సారి కూడా ఫైన‌ల్స్‌కు చేరుకున్న దాఖాల లేదు. కానీ ఈ సారి మాత్రం క‌చ్చితంగా ఫ్లే అప్ కు క‌చ్చితంగా చేరుకుంటుందని క్రికెట్ పెద్ద‌లు విశ్లేషిస్తున్నారు

IPL 2020: ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ జ‌ట్టు ఒక్క సారి కూడా ఫైన‌ల్స్‌కు చేరుకున్న దాఖాల లేదు. కానీ ఈ సారి మాత్రం క‌చ్చితంగా ఫ్లే అప్ కు క‌చ్చితంగా చేరుకుంటుందని క్రికెట్ పెద్ద‌లు విశ్లేషిస్తున్నారు. ఈ జ‌ట్టులో శ్రేయ‌స్సు అయ్య‌ర్‌, రిషబ్ పంత్, శిఖర్ ధావన్, పృథ్వీ షా, అమిత్ మిశ్రా, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్లు వంటి మేటీ ఆట‌గాళ్లల‌తో అత్యంత దుర్భేయంగా క‌నిపిస్తున్న‌ది.

జట్టులో ఫాస్ట్ బౌలర్లుగా కగిసో రబాడా మరియు క్రిస్ వోక్స్ వంటి ఇద్దరు ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు. అదే సమయంలో, స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, సందీప్ లామిచనే వంటి నలుగురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అలాగే ఈ జ‌ట్టుకు కోచ్ గా రికీ పాంటింగ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టైటిల్ సాధించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని కెప్టెన్ శ్రేయ‌స్సు అయ్య‌ర్ అన్నారు. అనుభ‌వ‌జ్ఞులైన తోటి ఆట‌గాళ్ల సాయం తీసుకోవ‌డంలో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌నని తెలిపారు.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ ఆ జట్లుకు సంబంధించిన కొత్త జెర్సీని ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీ మునుపటి కంటే చాలా అందంగాను, ఆకర్షనీయంగానూ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన తోటి ఆటగాళ్లతో పాటు జెర్సీని ఆవిష్కరించారు. అయితే ఈసారి మాత్రం జట్టు 2020లో ఎలా ప్రదర్శన ఇస్తుంది? ఈ జట్టులో మొదటిసారి జట్టు ఐపిఎల్ ఛాంపియన్లుగా నిలిచే ఆటగాళ్ళు ఉన్నారనేది విశ్లేషకుల అభిప్రాయం.


Show Full Article
Print Article
Next Story
More Stories