ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం

Update: 2019-05-04 03:19 GMT

ఐపీఎల్‌లో పంజాబ్‌ ప్రయాణం ముగిసింది. సొంతగడ్డ పైనే కోల్‌కతా విజయం సాధించించింది. రెండు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి... దీంతో ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. స్యామ్‌ కరన్‌ (24 బంతుల్లో 55 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), వికెట్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ (27 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడు కనబర్చారు.

సందీప్‌ వారియర్‌ (2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. యువ ఓపెనర్, 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' శుబ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 65 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ... మరో ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (22 బంతుల్లో 46; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌తో 184 లక్ష్యాన్ని కోల్‌కతా 18 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకోకుండానే వెనుదిరిగింది. 

Similar News