IND V AUS 2nd ODI : రోహిత్ శర్మ ఔట్..

తొలి వన్డే ఓటమితో నైరాశ్యం‌లో ఉన్న భారత్ రెండో వన్డేలో తిరిగి గాడిలో పడింది.

Update: 2020-01-17 09:15 GMT

తొలి వన్డే ఓటమితో నైరాశ్యం‌లో ఉన్న భారత్ రెండో వన్డేలో తిరిగి గాడిలో పడింది. రాజ్‌కోట్‌లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు జోరు కొనసాగించారు. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసీస్ బౌలర్లను చీల్చిచండాడారు. ఈ క్రమంలో 14వ ఓవర్లో బాల్ అందుకున్న జాంపా రెండో బంతికి రోహిత్ శర్మ ఎల్బీడబ్యూ రూపంలో ఔట్ చేశాడు. జాంపా వేసిన రెండో బంతిని పూల్ చేయబోయే వికెట్ల ముందు దొరికిపోయాడు. టీమిండియా ఓపెనర్లలు తొలి వికెట్ కు 81 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. 15 ఓవర్లు ముగిసేసరిగి టీమిండియా వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ (42 పరుగులు, 44 బంతుల్లో, 6 ఫోర్లు) ఔటైయ్యాడు. అయితే రోహిత్ తన కెరీర్ లో 9వేల పరుగుల మైలురాయికి నాలుగు పరుగుల దూరంలో ఔట్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు కలిసి వచ్చిన మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. మరో ఓపెనర్ ధావన్ 35 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

 

Tags:    

Similar News