హీరో అంటే ఇంట్లో కూర్చోనేవాడే : మహ్మద్‌ షమి

కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి దేశప్రజలందరూ 21 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని టీంఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి విజ్ఞప్తి చేశాడు.

Update: 2020-03-27 11:36 GMT
mohammed shami

కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి దేశప్రజలందరూ 21 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని టీంఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి విజ్ఞప్తి చేశాడు.కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి దేశప్రజలందరూ 21 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని టీంఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి విజ్ఞప్తి చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రధాని మోదీ ఇటీవల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బతో క్రీడా టోర్నీలు నిలిచిపోడంతో క్రీడాకారులకు తగినంత విశ్రాంతి దొరికింది.

ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు మద్దతు తెలుపుతూ.. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. తమ అభిమానులకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా మహ్మద్‌ షమి ఓ వీడియో ట్విటర్‌లో విడుదల చేశాడు. ఈ సందర్భంగా దేశ పౌరులు ఇంట్లోనే ఉండాలని కోరాడు. దానికి #GharBaithoIndia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు.

ప్రస్తుతం మనం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. దేశ ప్రజలంతా ఇళ్లలోనే ఉండండి. ఈ సమయం మనకెంతో కీలకం. ఇంట్లో కూర్చునే వారే దేశానికి హీరో. హీరోగా ఉండడం అంత తేలిక కాదు. డాక్టర్ చెప్పిన సూచనలు పాటించి అందరికి ఇళ్లలోనే ఉండమని మీరూ చెప్పండి. ధన్యవాదాలు' అని షమి ట్వీట్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News