T20 Worldcup 2021- India vs Scotland: స్కాట్లాండ్‌పై టీమిండియా ఘన విజయం

* 85 పరుగులకు ఆలౌట్ అయిన స్కాట్లాండ్

Update: 2021-11-06 04:55 GMT

 స్కాట్లాండ్‌పై టీమిండియా ఘన విజయం

India vs Scotland: టీ20 ప్రపంచకప్ 2021లో పసికూన స్కాట్లాండ్‌పై టీమిండియా విజృంభించింది. ఈ టోర్నమెంట్ లో మొదటిసారి టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం టీమిండియా బౌలర్స్ విజృంభించడంతో స్కాట్లాండ్ 17.4 ఓవర్లలోనే 85 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఎడాపెడా బౌండరీలు బాదుతూ చెలరేగింది. ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ టీమిండియా 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

ఇక ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్ వీరవిహారం చేశారు. ఈ ఇద్దరూ మొదటి వికెట్‌కు 70 పరుగులు భాగస్వామ్యం అందించారు. అనంతరం 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర రోహిత్ పెవిలియన్ చేరినా.. ఆ తర్వాత రాహుల్ మరింత చెలరేగి ఆడాడు. రాహుల్ 18 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇక టీమిండియా సెమీస్ చేరాలంటే ఆదివారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లోనూ ఇదే స్థాయిలో గెలవాల్సి ఉండగా అదేరోజు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ గెలవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News