India vs Sri Lanka : శ్రీలంక ముందు భారీ లక్ష్యం

Update: 2020-01-10 15:25 GMT
విరాట్ కోహ్లీ

అసలైనా 20-20 మజా నువ్వా నేనా అన్నట్లు బంతికి బ్యాట్ కి మధ్య పోరాటం. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత ఓపెనర్లు శ్రీలంక జట్టకు చుక్కలు చూపించారు. 67బంతుల్లో 97పరుగుల భాగస్వామ్యాన్ని ఓపెనర్లు ధావన్, కెఎల్ రాహుల్ నెలకొల్పి శ్రీలంకకు కొరకరాని కొయ్యల తయారైయ్యారు. ఆ దశలో మొదటి వికెట్ కోల్పోయింది భారత్ . తర్వాత ఆటతీరు మారిపోయింది. అప్పటి వరకు రెండు వందల పైచిలుకు పరుగులు చేస్తుందనుకున్న భారత్ వరసగా నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరులు దాటుతుందా అని పించింది. ఈ దశలో కోహ్లీ వికెట్ కోల్పోయింది. మధ్య ఓవర్లలో ముఖ్యంగా 11-15 ఓవర్ల 46 లోపే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ పుంజుకోవడం కష్టమైపోయింది. శార్థుల్ ఠాకుర్ , పాండే కలిసి అద్భుతమే చేశారు. చివరి ఓవర్లలో శ్రీలంక బౌలర్లపై విరుచుపడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్ రెండు వందల పరుగుల స్కోరు దాటి 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

టీమిండియా ఓపెనర్లు ధావన్(52 పరుగులు, 36 బంతుల్లో, 7ఫోర్లు, 1 సిక్స్) కెఎల్ రాహుల్ (54,36 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్స్ ) సాధించారు. కెప్టెన్ కోహ్లీ (26) పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద మనీష్ పాండేతో సమన్వయలోపం కారణంతో రనౌట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లలో లక్షణ్‌ సందాకన్‌ మూడు వికెట్లు తీసుకోగా.. కుమర, హసరంగా చెరో వికెట్ దక్కించుకున్నారు. 

Tags:    

Similar News