IND Vs SL 3rd T20 : టాస్ గెలిచిన శ్రీలంక.. ఇరు జట్లలో కీలక మార్పులు

పుణే వేదికగా భారత్ శ్రీలంక మధ్య నిర్ణయాత్మక మూడో టీ20లో మరి కాసేపట్లో జరుగనుంది మొదట టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది.

Update: 2020-01-10 13:14 GMT
Ind VSL 3rd t20

పుణే వేదికగా భారత్ శ్రీలంక మధ్య నిర్ణయాత్మక మూడో టీ20లో మరి కాసేపట్లో జరుగనుంది మొదట టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణయాత్మక పోరులో శ్రీలంకను సొంతగడ్డపై మట్టికరిపించి 2–0తో సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుంది. మరోవైపు శ్రీలంక ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ సమం చేసిన పరువు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది.పిచ్ విషయానికి వస్తే.. పిచ్ మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ కు సమాన అవకాశాలు ఉన్నాయి. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ కఠినంగా మారొచ్చు.

మరోవైపు టీమిండియా జట్టులో మూడు మార్పులు చేసింది. మైదానంలో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్న మనీశ్‌ పాండే, సంజు శాంసన్‌లకు ఎట్టకేలకు చోటుకల్పించింది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో చాహల్‌ను తీసుకుంది. ఇక శ్రీలంక జట్టులో రెండు మార్పులు చేశారు. సినీయర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌, లక్షణ్‌ సందాకన్‌ ఎంపిక చేశారు. ఉడానా గాయం కారణంగా దూరమైయ్యాడు.

తుది జట్టు ఇదే

భారత్‌: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్ ధావన్, కేఎల్. రాహుల్, శ్రేయస్స్ అయ్యర్, మనీష్ పండే, సంజుశాంసన్( వికెట్ కీపర్),వాషింగ్టన్ సుందర్, చాహల్ ,నవదీప్ షైనీ, శార్దుల్, బుమ్రా.

శ్రీలంక: లతీస్ మలింగ (కెప్టెన్‌), గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండో, కుషాల్‌ పెరెరా, మాథ్యూస్,‌ లహిరు కుమార, షనక, హసరంగ, లక్షణ్‌ సందాకన్‌  




Tags:    

Similar News