IND vs SL 2nd T20I: శ్రీలంకపై భారత్ జయభేరి

Update: 2020-01-07 17:14 GMT
Ind Vs SL 2nd t20

కొత్త సంవత్సరాన్ని భారత్ విజయంతో ఆరంభించింది. ఇండోర్ వేదికగా టీమిండియాతో మంగళవారం జరిగిన రెండో రెండో టీ20లో శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాదించింది. శ్రీలంక నిర్ధేశించిన 143 పరుగలు విజయ లక్ష్యాన్ని 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టీమిండియా ఓపెనర్లు రాహుల్ (45 పరుగులు 32 బంతుల్లో, 6 ఫోర్లు) తో ధాటిగా ఆడుతు మరోసారి తన ఫామ్ కొనసాగించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (32 పరుగులు 29బంతుల్లో రెండు ఫోర్లు) ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 71పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. హసరంగా బౌలింగ్ లో ఇద్దరు స్వల్ప వ్యవధిలో ఔటైయ్యారు. శ్రేయస్స్ అయ్యర్(34పరుగులు 26 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సు ) కెప్టన్ విరాట్ కోహ్లీ(30 పరుగులు, 17బంతుల్లో, 1ఫోరు, 2 సిక్సులు ) ధాటిగా ఆడారు. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత కోహ్లీ 1000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. 

ఈ నేపథ్యంలో విజయయానికి మరో ఆరు పరుగుల దూరంలో శ్రేయస్స్ అయ్యార్ ఔట్ అయ్యాడు. పంత్ తో కలిసి కోహ్లీ లంఛనాన్ని పూర్తి చేశారు. విండీస్ బౌలర్లలో హసరంగ 30 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకోగా, లహీరు కుమార ఒకవికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ 1-0తో ముందజలో ఉంది. ఇక సిరీస్ లో మిగిలిన మూడో టీ20 మ్యాచ్ శుక్రవారం పుణెలో జరగనుంది. గువహటిలో తొలి టీ20 వర్షం కారణంతో రద్దయిన సంగతి తెలిసిందే.

అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (34 పరుగులు, 28 బంతుల్లో , 3 సిక్సర్లు) శ్రీలంక తరపున అత్యధిక పరుగులు సాధించాడు. టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లంకకు ఓపెనర్లు శుభారం ఇచ్చారు. ఆవిష్క ఫెర్నాండో (22) ఐదు ఫోర్లతో రాణించాడు.

అయితే ఐదో ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ ఫెర్నాండోని అవుట్ చేశాడు. 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గుణతిలక నిలకడగా ఆడుతున్నాడు. గుణతికలను నవదీప్ పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ పెరీర చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఇతర బ్యాట్స్ మెన్ ఎవరి నుంచి మద్దతు దొరక్కపోవడంతో శ్రీలంక తక్కకు స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో ఠాకూర్ మూడు వికెట్లు తీసుకున్నాడు. నవదీప్ సైనీ, కుల్దీప్కు రెండేసి వికెట్లు పడగొట్టారు. సుందర్, బుమ్రాకు చెరో వికెట్ దక్కింది.



 

Tags:    

Similar News