టీమిండియా సౌతాఫ్రికా సిరీస్‌ను వదలని కరోనా సెగ

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా - సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది.

Update: 2020-03-12 16:44 GMT
India Legends Sachin and Team India File Photo

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా - సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌కు పదే పదే వర్షం అడ్డంకిగా మారండంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కాగా.. ఈ రోజు ఉదయం నుంచి పలు మార్లు వర్షం పడుతూ ఉండటంతో టాస్‌ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. సాయంత్రం కాస్త తెరిపిచ్చినప్పటికీ మైదానం చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్‌ను నిర్వహించడం కష్టం కావడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మార్చి 15న ఆదివారం లక్నోలో జరగనుంది.

లక్నో వేదికగా జరగనున్న రెండో వన్డేకు, కోల్‌కతాలో మార్చి 18న జరగనున్న మూడో వన్డేకు కరోనా సెగ తగిలింది. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సూచనల మేరకు.. క్రీడాశాఖ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌కు స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ జారీ చేసింది. క్రీడా పోటీలు ఏవైనా నిర్వహించాలని అనుకుంటే జనాలు లేకుండా నిర్వహించాలని తెలిపింది. దీంతో ప్రస్తుతం టీమిండియా-సౌతాఫ్రికా రెండు, మూడు వన్డేలకు కూడా ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఈ రెండు మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరిగే అవకాశం ఉంది.

ఇక కేంద్రప్రభుత్వ సూచనలతో ముంబైలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ కు కూడా కరోనా సెగ తగిలింది. శివసేన ప్రభుత్వం ఇప్పటికే టికెట్ అమ్మకాలపై కొరడా ఝలిపించింది. దీంతో సచిన్ నేతృత్వంలోని భారత్ లెజెండ్స్, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ నుంచి ఈ నిబంధనలు అమలు కానున్నాయి. ఐపీఎల్ నిర్వహించాలన్నా ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

 

Tags:    

Similar News