నేడే చారిత్రాత్మక పింక్‌బాల్ టెస్ట్‌

భారత్ - బంగ్లాదేశ్ మధ్య చరిత్రక డే/నైట్ టెస్టు మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డె్న్స్ వేదికగా ఆరంభంకానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి.

Update: 2019-11-22 02:12 GMT
India vs Bangladesh Eden Gardens historic Day-night Test

భారత్ - బంగ్లాదేశ్ మధ్య చరిత్రక డే/నైట్ టెస్టు మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డె్న్స్ వేదికగా ఆరంభంకానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్ జట్లు తొలిసారి పింక్‌బాల్‌తో ఆడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తు్న్నారు. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ బంగ్లా -భారత్ జట్ల మధ్య తొలి డే-నైట్ టెస్టు మ్యాచ్.

మ్యాచ్ ను బీసీసీఐ ఘనంగా నిర్వహించనుంది. మొదట టాస్ ముందు ఆర్మీ సిబ్బంది పారాట్రూపర్స్‌లో వచ్చి కెప్టెన్లకు పిక్ బాల్స్ అందిస్తారు. అతిధులు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాతో బెల్ మోగిచనున్నారు.

తొలి డై /నైట్‌ టెస్టు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ మధ్య 2015లో అడిలైడ్ వేదికగా జరిగింది. ఐసీసీ 2015లోనే డై /నైట్‌ టెస్టులకు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అప్పటి బీసీసీఐతో భారత్ జట్టు అంగీకరించలేదు. టీమిండియా మాజీ సారధి సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడంతో డే/నైట్‌ టెస్టు ప్రతిపాదన తెర ముందుకు వచ్చింది. ఆ తర్వాత భారత కెప్టెన్ కోహ్లీని -అటు బంగ్లా బోర్డును గంగూలీ ఒప్పించాడు.

2015 నుంచి టెస్టు చరిత్రలో 11 డే నైట్‌ టెస్టులు నిర్వహించారు. ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 5 డే- నైట్‌ టెస్టులు మ్యాచులు ఆడింది. శ్రీలంక ఇంగ్లాండ్, విండీస్ మూడేసీ డే/నైట్ టెస్టు మ్యాచులు ఆడాయి. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, చెరో రెండు టెస్టు మ్యాచులు ఆడితే. పసికూన జింబాబ్వే ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ జట్లు మధ్య 12వ డే- నైట్‌ టెస్టు మ్యాచ్.


ఈ మ్యాచ్‌కు టీమిండియా మాజీ ఆటగాళ్లు అందరూ రానున్నారు. టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా, బ్యాడ్మింటన్‌ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు, మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌లను సత్యరించనున్నారు. ఈ మ్యాచ్ ను మధ్యాహ్నాం 1 గంటకు స్టార్ సోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Tags:    

Similar News