India vs Bangladesh 2nd Test : బంగారు నాణెంతో టాస్

Update: 2019-11-22 07:28 GMT

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లా భారత్ మధ్య చరిత్రాత్మక టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గులాబీ బంతితో ప్లడ్ లైట్లు వెలుగులో రెండు జట్లు టెస్టు ఇదే తొలి టెస్టు మ్యాచ్. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పటికే భారత్ బంగ్లా మధ్య జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ కోసం బంగారు నాణెం తయారు చేయించారు. ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా పశ్చిమ బెంగాల్ సిీఎం మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని హసినా హాజరైయ్యారు

తొలి డై /నైట్‌ టెస్టు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ మధ్య 2015లో అడిలైడ్ వేదికగా జరిగింది. ఐసీసీ 2015లోనే డై /నైట్‌ టెస్టులకు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అప్పటి బీసీసీఐతో భారత్ జట్టు అంగీకరించలేదు. టీమిండియా మాజీ సారధి సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడంతో డే/నైట్‌ టెస్టు ప్రతిపాదన తెర ముందుకు వచ్చింది. ఆ తర్వాత భారత కెప్టెన్ కోహ్లీని -అటు బంగ్లా బోర్డును గంగూలీ ఒప్పించాడు.





Tags:    

Similar News