Ind vs Ban 2nd Test Day 2 ; కోహ్లీ ఔట్.. భారత్ 347/9 డిక్లేర్డ్

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ 347 పరుగుల వద్ద భారత్ డిక్లేర్డ్ చేసింది.

Update: 2019-11-23 11:39 GMT
India vs Bangladesh

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ 347 పరుగుల వద్ద భారత్ డిక్లేర్డ్ చేసింది. రెండో రోజు భారత జట్టు సారథి కోహ్లీ ( 136పరుగులు, 194 బంతులు,18 ఫోర్లు) బంగ్లాదేశ్ బౌలర్లపై చెలరేగిపోయాడు. కోహ్లీ తన టెస్ట్ కెరీర్ 27వ శతకం నమోదు చేశాడు. ఇబాదత్ బౌలింగ్‌‌లో ప్లిక్ షాట్ ఆడిన కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర తైజుల్ ఇస్లామ్ దొరికిపోయాడు. దీంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఓవర్ నైట్ స్కోరు 174/3తో శనివారం ఆటను కొనసాగించిన భారత్ అజింక్య రహానె( 51పరుగులు, 69బంతులు, ఏడు ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఇస్లామ్ బౌలింగ్‌లో హుస్సెన్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగో వికెట్‌కు కోహ్లీతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 89 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 347/9 తో ఉంది. ఉమేశ్ యాదవ్, ఇషాంత్ ఇద్దరూ డకౌట్ గా వెనుదిరిగారు. సాహా (17) షమీ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాపై 241 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది.

మొదటి రోజు తొలి ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్ 106 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు ధాటికి బంగ్లా బాట్స్ మెన్స్ పెవిలియన్ కి క్యూ కట్టారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం ఒక్కడే 29 పరుగులు చేసి టాప్ లో నిలిచాడు. బంగ్లా బాట్స్ మెన్స్ లో నలుగురు డకౌట్ అయ్యారు. భాతర బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్ మూడు, షమీ రెండు వికెట్లు తీసుకున్నారు.

Tags:    

Similar News