India vs Bangladesh 1st-test : రికార్డు నెలకొల్పిన అశ్విన్

Update: 2019-11-14 09:15 GMT
Ravichandran Ashwin

బంగ్లాదేశ్ భారత్ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. ఇండోర్ వేదిక ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ రికార్డు నమోదు చేశాడు. మ్యాచ్‌లో సొంత గడ్డపై టెస్టుల్లో 250 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత్ బౌలర్ గా అశ్వీన్ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ రెండో సెషన్ లో బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ మొమినల్ హక్ (37) పరుగుల వద్ద క్లీన్‌బౌల్డ్ చేశాడు.

టీమిండియా టెస్టు జట్టులోకి 2011లో నవంబరు 06న అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి సుదీర్ఘ కెరీర్‌లో 69 టెస్టులాడి 359 వికెట్లు అశ్విన్ పడగొట్టాడు. టెస్టుల్లో 27 సార్లు ఐదు వికెట్లు సాదించాడు. 10 వికెట్లను 7సార్లు సాధించాడు.

అయితే టెస్టుల్లో సొంతగడ్డపై శ్రీలంక స్పిన్నర్ ముత్తయ మురళీధరన్ 42 టెస్టులు ఆడి 250 వికెట్లు తీసుకున్నాడు. భారత దిగ్గజ బౌలర్ మాజీ సారధి అనిల్ కుంబ్లే 43 టెస్టులో ఈ ఘనత సాధిస్తే, అశ్విన్ మాత్రం 42 టెస్టుల్లోనే మైలురాని అందుకున్నాడు. మరో టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ సొంత గడ్డపై 51 టెస్టుల్లో 250 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ మాత్రం మురళీధరన్ రికార్డును సమం చేశాడు. వీరి తర్వాత శ్రీలంక మరో బౌలర్ హెరాత్ (44), డేల్ స్టెయిన్ (49) మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో విఫలమైంది. 150 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో షామీ మూడు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ , ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు 

Tags:    

Similar News