India vs Bangladesh 1st-test; తొలి ఇన్నింగ్స్ 150 పరుగులకే బంగ్లా ఆలౌట్
బంగ్లాదేశ్ భారత్ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. అత్యల్ప స్కోరుకే బంగ్లా ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి 150 పరుగులకే కుప్పకూలిపోయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్స్‌లో ముష్ఫికర్ రహీమ్ 105 బంతులు ఎదుర్కొని 43 పరుగులు సాధించాడు. బంగ్లా టెస్టు కెప్టెన్ మొమినుల్ హక్ 37 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ దారి పట్టారు. దీంతో స్పల్ప స్కోరుకే ఆలౌటైయింది. మొదట టాస్ గెలిచిన బంగ్లా సారథి మొమినుల్ హక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్ మొదటి సెషన్ ఆరంభంలోనే ఒపెనర్లు షాద్‌మాన్ ఇస్లామ్, ఇమ్రూల్ ఖయ్యూస్ డబుల్ డిజిట్ కూడా చేయలేదు దీంతో జట్టు స్కోరు 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
అనంతరం బరిలోకి దిగిన మహ్మద్ మిథున్(13)ని మహ్మద్ షమీ ఔట్ చేశాడు. 18 ఓవర్లు 31/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో వికెట్‌కు ముష్ఫికర్ రహీమ్(43 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి కెప్టెన్ మొమినుల్ హక్ (37, 80 బంతుల్లో,6 ఫోర్లు) వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొమినుల్ హక్ జట్టు స్కొరు 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం రహీమ్ అవుట్ కావడంతో తర్వాత బ్యాట్స్ మెన్లు ఎవరు రాణించలేదు. దీంతో బంగ్లా 150 పరుగలకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరు ఓవర్లలో 12 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(6) రోహిత్ శర్మ(6) క్రీజులో ఉన్నారు.