IND v AUS 1st ODI : వంద పరుగుల భాగస్వామ్యం నమోదు

Update: 2020-01-14 09:48 GMT
India vs Australia 1st odi

ముంబైలోని వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ బౌలర్లను టీమిండియా బ్యాట్స్ మెన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. రెండో వికెట్‌కు శిఖర్ ధావన్, రాహుల్ ఇద్దరూ కలిసి వంద పరుగుల భాగస్వామన్యం నమోదు చేశారు. ఇప్పటికే ధావన్ ఆర్థ సెచంరీతో ఆసీస్ బౌలర్లపై చెలరేగిపోతున్నాడు. మరోవైపు రాహుల్ 40 పరుగులతో రాణిస్తున్నాడు. ధావన్ (63, 88 బంతుల్లో) అంతుకు ముందు 66 బంతులు ఎదుర్కొన్న ధావన్ 8 ఫోర్లుతో ఆర్ధసెంచరీ సాధించాడు. వన్డే కెరీర్ లో ధావన్ కు 28వ హాఫ్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. మొదట టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆదిలో తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (10) జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఔటైయ్యాడు. 4.3 ఓవర్ల వద్ద స్టార్క్ బౌలింగ్ లో వార్నార్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 25 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి భారత్ 124 పరుగులు చేసింది. రాహుల్ ,ధావన్ ఆసీస్ బౌలర్లపై ధాటిగా ఆడుతున్నారు.

 

 

Tags:    

Similar News