Team India: కొత్త శకానికి టీమిండియా.. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు యువ సారథి..! 

Team India: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది.

Update: 2025-05-24 09:20 GMT

Team India: కొత్త శకానికి టీమిండియా.. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు యువ సారథి..! 

Team India: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది. యువ బ్యాట్స్‌మెన్ శుభమాన్ గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీని అప్పగించారు. అయితే, స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‌లకు జట్టులో చోటు దక్కలేదు.

కొత్త సారథి శుభమాన్ గిల్.. పంత్ వైస్ కెప్టెన్

బీసీసీఐ శుభమాన్ గిల్‌ను టెస్ట్ జట్టు కెప్టెన్‌గా నియమించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‌ను టెస్ట్ జట్టులోకి సెలక్ట్ చేయలేదు. అతను ఐపీఎల్ 2025లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతను టీమిండియాకు హీరోగా నిలిచాడు.

కర్ణుణ్ నాయర్‌కు 8 ఏళ్ల తర్వాత ఛాన్స్

బీసీసీఐ ఇంగ్లాండ్ పర్యటన కోసం 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్‌తో సహా ఆరుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేశారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌లతో సహా ముగ్గురు స్పిన్నర్లకు చోటు దక్కింది.

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ కు ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యారు. నాయర్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అతను చివరిసారిగా 2017లో భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. శార్దూల్ ఠాకూర్ కూడా ఈ టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యారు.

ఇంగ్లాండ్ పర్యటనకు 18 మంది సభ్యుల టీమిండియా:

శుభమాన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్

Tags:    

Similar News