Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే 15 మంది భారత ఆటగాళ్లు వీరే..!
ICC Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీకి భారత క్రికెట్ జట్టును బీసీసీఐ జనవరి 18న ప్రకటించింది.
ICC Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీకి భారత క్రికెట్ జట్టును బీసీసీఐ జనవరి 18న ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లున్నాయి. బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి 20న భారత్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో మార్చి 3న న్యూజిలాండ్ పోటీ పడుతుంది. పాకిస్తాన్ ఈ టోర్నీని నిర్వహిస్తోంది. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరుగుతాయి.
భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కె.ఎల్. రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, షమి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హర్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, అర్హదీప్, జైస్వాల్, రిషబ్ పంత్, జడేజా