NZ vs AUS: ఆసీస్‌ చేతిలో కివీస్‌ ఘోర ఓటమి.. అగ్రస్థానానికి చేరిన భారత్‌

NZ vs AUS: తొలిస్థానంలో కొనసాగాలంటే ఇంగ్లండ్ మ్యాచ్ లో విజయం తప్పనిసరి

Update: 2024-03-03 06:06 GMT

NZ vs AUS: ఆసీస్‌ చేతిలో కివీస్‌ ఘోర ఓటమి.. అగ్రస్థానానికి చేరిన భారత్‌

NZ vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోవడం భారత్‌కు కలిసొచ్చింది. అదేంటి ఆ జట్టు ఓడిపోతే మనకు కలిగిన లాభమేంటనేగా? మీ సందేహం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చి లోగా టాప్ -2 జట్లు ఫైనల్‌లో తలపడతాయి. ఇప్పటికే రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా హ్యాట్రిక్‌పై కన్నేసింది. అయితే, న్యూజిలాండ్‌ నిన్నటి వరకు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్‌ కొనసాగుతోంది.

అయితే, ఇప్పుడు ఆసీస్‌ చేతిలో పరాజయం పాలైన కివీస్‌ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 64.58 విజయాల శాతంతో టాప్‌లో నిలవగా.. న్యూజిలాండ్‌ 60 శాతం, ఆస్ట్రేలియా 59.09 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో భారత్‌ మార్చి 7 నుంచి చివరి టెస్టు ఆడనుంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా అందులోనూ గెలిస్తే పర్సంటేజీ మరింత మెరుగై అగ్రస్థానం నిలబడుతుంది.

ఓడితే మళ్లీ మూడో స్థానానికి పడిపోయే ఛాన్స్ ఉంది. మార్చి 8 నుంచి ఆసీస్-కివీస్‌ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత నుంచి దాదాపు మూడు నెలలపాటు టెస్టులను ఈ నాలుగు జట్లూ ఆడవు. కాబట్టి మూడు నెలల పాటు టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ గా కొనసాగుతుంది.

Tags:    

Similar News