IND vs ENG 2nd ODI: రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా... సెంచరీతో చెలరేగిపోయిన రో'హిట్ మేన్'

Update: 2025-02-09 16:22 GMT

IND vs ENG 2nd ODI: రెండో మ్యాచ్‌లోనూ గెలిసి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా... చెలరేగిపోయిన రోహిత్ శర్మ

IND vs ENG 2nd ODI Match Highlights: ఇంగ్లాండ్‌పై జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 305 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్ల నష్టానికి మరో 33 బంతులు మిగిలి ఉండగానే పూర్తిచేసింది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఇండియా ఫస్ట్ వన్డే గెలిచి సిరీస్‌లో పై చేయి సాధించింది. ఇక ఈ రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా గెలవడంతో భారత్ ఈ వన్డే సిరీస్ సొంతం చేసుకున్నట్లయింది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన శుభారంభాన్నిచ్చారు. ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ మళ్లీ హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు.

ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కుంటున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేశాడు. 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు ఉండగా 7 సిక్సులు ఉన్నాయి. దూకుడు మీదున్న రోహిత్‌కు ఇంగ్లండ్ బౌలర్ లివింగ్ స్టోన్ తన బంతితో కళ్లెం వేశాడు.

29.4 ఓవర్ వద్ద లివింగ్ స్టోన్ విసిరిన బంతిని హిట్ ఇవ్వగా ఆదిల్ రషీద్ డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. దాంతో రోహిత్ పెవిలియన్ బాటపడ్డాడు. రోహిత్ శర్మకు ఈ మ్యాచ్‌లో కొట్టిన సెంచరీ తన వన్డే కెరీర్లో 32వ సెంచరీ. శుభ్‌మాన్ గిల్ కూడా రోహిత్ శర్మకు సపోర్ట్ అందిస్తూ 52 బంతుల్లో 60 పరుగులు చేసి మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ 5 పరుగులకే రషీద్ బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 44 పరుగులతో హాఫ్ సెంచరీకి దగ్గర్లో ఉండగా రషీద్ బౌలింగ్‌లోనే తొందరపడి రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్య చెరో 10 పరుగులకే ఔట్ అయ్యారు. అక్షర్ పటేల్ 41 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చాడు.

టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. మొహమ్మద్ షమి, హర్షిత్ రానా, హార్ధిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తో సరిపెట్టుకున్నారు. షమి, రానా ఇద్దరూ ప్రత్యర్థులకు అత్యధిక పరుగులు సమర్పించుకున్నారు.  

Tags:    

Similar News