IND-W vs AUS-W: నేడే మహిళల ప్రపంచ కప్‌లో బిగ్ మ్యాచ్.. 7 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనున్న భారత్
IND-W vs AUS-W: మహిళల ప్రపంచ కప్ 2025 లో టీమిండియాకు అతి పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది.
IND-W vs AUS-W: నేడే మహిళల ప్రపంచ కప్‌లో బిగ్ మ్యాచ్.. 7 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనున్న భారత్
IND-W vs AUS-W: మహిళల ప్రపంచ కప్ 2025 లో టీమిండియాకు అతి పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. టోర్నమెంట్‌లో భాగంగా నేడు (అక్టోబర్ 12) భారత మహిళల జట్టు, 7 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బలమైన ఆస్ట్రేలియా మహిళల జట్టుతో తలపడనుంది. గత మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన, ఈ మ్యాచ్‌ను గెలవడం చాలా కీలకం. ముఖ్యంగా, వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాకు భారత్‌పై తిరుగులేని రికార్డు ఉంది.
మహిళల ప్రపంచ కప్ 2025 లో భారత మహిళల జట్టుకు ఇది నాలుగో మ్యాచ్, టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అత్యంత కఠినమైన పరీక్ష. గత మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు ఒత్తిడిలో ఉంది. మరోవైపు, ఎలిసా హీలీ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా చాలా బలంగా కనిపిస్తోంది.
మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 7 సార్లు టైటిల్ గెలిచి ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఇంగ్లాండ్ 3 సార్లు, న్యూజిలాండ్ 1 సారి కప్ గెలిచాయి. భారత మహిళల జట్టు 2 సార్లు ఫైనల్‌కు చేరినా, టైటిల్ గెలవలేకపోయింది.
హెడ్ టు హెడ్ రికార్డు: భారత్, ఆస్ట్రేలియా మధ్య నేటి మ్యాచ్ 60వ వన్డే. ఈ రికార్డులో ఆస్ట్రేలియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తం మ్యాచ్‌లు: 59
భారత్ గెలిచింది: 11
ఆస్ట్రేలియా గెలిచింది: 48
మహిళల ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టిను పరిశీలిస్తే.. ఇంగ్లాండ్ శనివారం శ్రీలంకపై గెలిచి పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌లలో 2 విజయాలు, 1 మ్యాచ్ వర్షం వల్ల రద్దు అవ్వడంతో 5 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. భారత్ 3 మ్యాచ్‌లలో 2 విజయాలు, 1 ఓటమితో 4 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఈ కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా భారత జట్టు తన స్థానాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
భారత మహిళల జట్టు వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్టు మధ్య జరిగే ఈ మ్యాచ్ వివరాలు:
తేదీ, సమయం: నేడు, అక్టోబర్ 12, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ 2:30 గంటలకు ఉంటుంది.
వేదిక: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ - వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
లైవ్ ప్రసారం: మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో చూడవచ్చు. అలాగే జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.