IND vs ENG 4th Test: నేటి నుంచి భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య కీలకమైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌

IND vs ENG 4th Test: భారత్‌ vs ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కీలక మలుపు తిరిగింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ నేడు (జూలై 23) మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.

Update: 2025-07-23 03:30 GMT

IND vs ENG 4th Test: నేటి నుంచి భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య కీలకమైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌

IND vs ENG 4th Test: భారత్‌ vs ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కీలక మలుపు తిరిగింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ నేడు (జూలై 23) మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభమవుతుంది. అదే సమయంలో టాస్ ప్రక్రియ కూడా జరగనుంది.

భారత జట్టు ఇప్పటికే మూడు టెస్టుల్లో ఒకదానిని మాత్రమే గెలిచి వెనుకబడింది. ఇక నాలుగో టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసేందుకు భారత్‌కు ఇది తుదిపోరు లాంటి మ్యాచ్. మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని గట్టిగా పట్టుకున్నట్టే అవుతుంది.

గాయాల బెడద.. భారత జట్టులో భారీ మార్పులు

భారత జట్టులో ఈ మ్యాచ్‌కు ముందు అర్ష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావాల్సి వచ్చింది. తద్వారా భారత్ బలమైన మార్పులతో బరిలోకి దిగుతోంది.

జట్లు ఇలా...

భారత జట్టు:

యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (ఉప కెప్టెన్ & వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ / శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్.

ఇంగ్లండ్ జట్టు:

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.

Tags:    

Similar News