HCA: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

HCA: అక్టోబర్‌ 20వ తేదీన ఎన్నికలు నిర్వహణకు ముహూర్తం

Update: 2023-10-01 02:19 GMT

HCA: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

HCA: హెచ్‌సీఏకు 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మహ్మద్ అజారుద్దీన్ ప్యానెల్ కొలువుదీరింది. వివాదాల నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా మహ్మద్‌ అజారుద్దీన్ పదవీకాలం పూర్తైన తర్వాత.. సుప్రీంకోర్టు.. మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు HCA బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల నగారా మోగింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్‌ 20వ తేదీన ఎన్నికలు నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్‌కు ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ నేపథ్యంలో 173 మందితో కూడిన ఓట‌ర్ల జాబితాను కూడా విడుద‌ల చేశారు. వ‌చ్చే నెల 4 నుంచి 7వ తేదీ వ‌ర‌కు ఎన్నిక‌ల అధికారి వి.సంప‌త్ కుమార్ నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. అక్టోబరు 14న నామినేష‌న్ల‌ను స్క్రూటినీ చేయ‌నున్నారు. ఇక నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు 16వ తేదీని ఆఖరి రోజుగా నిర్ణయించారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వహించడం సహా అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించనున్నారు.

హెచ్‌సీఏకు 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మహ్మద్ అజారుద్దీన్ ప్యానెల్ కొలువుదీరింది. వివాదాల నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా మహ్మద్‌ అజారుద్దీన్ పదవీకాలం పూర్తైన తర్వాత.. సుప్రీంకోర్టు.. మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు HCA బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల నగారా మోగింది.

Tags:    

Similar News