Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ప్రపంచకప్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్..!

Hardik Pandya Ruled Out: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు.

Update: 2023-11-04 05:19 GMT

Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ప్రపంచకప్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్..!

Hardik Pandya Ruled Out: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ ధృవీకరించింది. అక్టోబర్ 19న పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతను ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. ప్రపంచకప్‌లో కేవలం 4 మ్యాచ్‌లు ఆడాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఔట్ కాగా..

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9వ ఓవర్ మూడో బంతికి హార్దిక్ చీలమండకు గాయమైంది. గాయాన్ని చూసిన వైద్య బృందం అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. హార్దిక్ స్థానంలో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. 3 బంతుల్లో 2 పరుగులు ఇచ్చాడు.

పూణె నుంచి ఎన్‌సీఏకు..

గాయపడిన పాండ్యా పూణె నుంచి ఎన్‌సీఏకి వెళ్లాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన పాండ్యా అక్టోబరు 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు పుణె జట్టుతో కలిసి వెళ్లలేదు. అతను పూణె నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి మారాడు. ప్రస్తుతం అతను NCAలోనే వైద్యుల పర్యవేక్షణలో పునరావాసం పొందుతున్నాడు.

ప్రపంచకప్‌లో పాండ్యా 5 వికెట్లు..

ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో హార్దిక్ పాండ్యా 6.84 ఎకానమీ రేటుతో 5 వికెట్లు పడగొట్టాడు. అతను 11 పరుగులు కూడా చేశాడు.

ప్రసిధ్ కృష్ణ తొలిసారి ప్రపంచకప్ జట్టులోకి..

ప్రసిధ్ కృష్ణ తొలిసారి ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. ప్రసిధ్‌ను బ్యాకప్‌గా సిద్ధంగా ఉండమని అడిగారు. అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. శనివారం టోర్నీకి సంబంధించిన ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత అతడిని భారత జట్టులో చేర్చారు.

ప్రసిద్ వన్డే కెరీర్‌..

భారత్ తరపున ప్రసిధ్ కృష్ణ 17 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 29 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతడిని టీమ్ ఇండియాలో చేర్చారు.

Tags:    

Similar News