U19 Women’s T20 World Cup: క్రికెట్ మహిళల వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌పై సెంచరీ.. ఎవరీ గొంగడి త్రిష?
Gongadi Trisha: అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిష సెంచరీ నమోదు చేశారు.
U19 Women’s T20 World Cup: క్రికెట్ మహిళ వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌పై సెంచరీ.. ఎవరీ గొంగడి త్రిష?
Gongadi Trisha: అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిష సెంచరీ నమోదు చేశారు. 53 బంతుల్లోనే ఆమె సెంచరీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గొంగడి త్రిష స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తన ఆటతీరుతో అందరి ప్రశంసలు పొందారు. అండర్ 19 టీ 2 ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా ఆమె రికార్డు సృష్టించారు.
ఎవరీ త్రిష?
తెలంగాణలోని భద్రాచలం లో 2005 డిసెంబర్ 15న త్రిష జన్మించారు. మూడో తరగతి నుంచే ఆమెకు క్రికెట్ పై ఆసక్తి ఏర్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు క్రికెట్ నేర్పించారు. కోచ్ వద్ద ఆమెకు క్రికెట్ లో మెళకువలు నేర్పించారు. అండర్ 16 జట్టులో ఆడి ఉమెన్ ఆఫ్ ది సిరీస్ గా ఆమె ఎంపికయ్యారు. అప్పటికి ఆమె వయస్సు ఎనిమిదేళ్లే. అండర్ 19 జట్లుకు ఆమె 12 ఏళ్ల వయస్సులో ఆడారు.
జైపూర్ లో జరిగిన అండర్ 19 మహిళల వన్ డే ఛాలెంజర్ ట్రోఫీలో ఓపెనర్ గా దిగి 112 పరుగులు చేశారు.58 బంతుల్లో ఆమె 112 పరుగులు చేశారు. 2021 నవంబర్ 7న జరిగిన ఇండియా డి తో జరిగిన మ్యాచ్ లో 116 బంతుల్లో 78 పరుగులు చేశారు. ఈ టోర్నిలో 260 పరుగులు చేశారు.
ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. 2022 నవంబర్ 29న ఐదు మ్యాచ్ ల టీ 20 సిరిస్ లో భాగంగా న్యూజిలాండ్ అండర్ 19 జట్టుపై భారత్ విజయం సాధించడంలో త్రిష కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్ లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 36 పరుగులు చేశారు. అంతేకాదు తన బౌలింగ్ లో ఒక వికెట్ రాబట్టారు. 2023 జనవరిలో ఐసీసీ నిర్వహించిన అండర్ 19 విమెన్స్ టీ 20 వరల్డ్ కప్ లో 24 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
హైదరాబాద్, సౌత్ జోన్ ఏజ్ గ్రూప్ జట్లకు త్రిష ఆడారు. 2017-18 లో సీనియర్ మహిళల టీ 20 లీగ్ లో హైదరాబాద్ తరపున ఆమె ఆడారు. 2021-22 లో మహిళల క్రికెట్ చాలెంజర్స్, విజయవాడలో జరిగిన సీనియర్ ఉమెన్స్ చాలెంజర్ ట్రోఫీలో ఇండియా బీ తరపున ఆమె ఆడారు.
కూతురి కోసం భద్రాచలం నుంచి సికింద్రాబాద్ కు
ఓ ప్రైవేట్ కంపెనీలో ఫిట్‌నెస్ ట్రైనర్ గా త్రిష తండ్రి రాంరెడ్డి పనిచేస్తారు. క్రికెట్ పై చిన్నతనంలోనే త్రిషకు ఉన్న అభిరుచిని గుర్తించి ఆమెకు క్రికెట్ కోచింగ్ ఇప్పించారు. కూతురు కోసం భద్రాచలం నుంచి ఆయన తన మకాన్ని సికింద్రాబాద్ కు మార్చారు. సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో కూతురికి శిక్షణ ఇప్పించారు. మిథాలీ రాజ్ ఇదే అకాడమీకి వచ్చేవారు. ఆమె వద్ద త్రిష సలహాలు తీసుకొనేది.బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా ఆమె రాణించారు. తొలుత ఆమె పేస్ బౌలింగ్ చేసేవారు. కోచర్ సూచన మేరకు ఆమె లెగ్ స్పిన్ కు మారారు.