Asia Cup Trophy : ఆసియా కప్ ట్రోఫీ దొంగకు గోల్డ్ మెడల్.. మొహసిన్ నఖ్వికి పాకిస్తాన్‌లో సన్మానం

ఆసియా కప్‎లో చాంపియన్ అయిన టీమ్ ఇండియాకు ట్రోఫీ, పతకాలను ఇవ్వకుండా వాటిని తనతో తీసుకెళ్లి ప్రపంచ క్రికెట్ ముందు ట్రోఫీ దొంగగా అపఖ్యాతి పాలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వికి పాకిస్తాన్‌లో గోల్డ్ మెడల్ ఇచ్చి సన్మానించినట్లు వార్తలు వస్తున్నాయి.

Update: 2025-10-04 05:30 GMT

Asia Cup Trophy : ఆసియా కప్ ట్రోఫీ దొంగకు గోల్డ్ మెడల్.. మొహసిన్ నఖ్వికి పాకిస్తాన్‌లో సన్మానం

Asia Cup Trophy : ఆసియా కప్‎లో చాంపియన్ అయిన టీమ్ ఇండియాకు ట్రోఫీ, పతకాలను ఇవ్వకుండా వాటిని తనతో తీసుకెళ్లి ప్రపంచ క్రికెట్ ముందు ట్రోఫీ దొంగగా అపఖ్యాతి పాలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వికి పాకిస్తాన్‌లో గోల్డ్ మెడల్ ఇచ్చి సన్మానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ జరిగే సమయంలో ఆయన తీసుకున్న కొన్ని ధైర్యవంతమైన నిర్ణయాలకు ఈ సన్మానం జరుగుతుందని నివేదికలు తెలుపుతున్నాయి, ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

పాకిస్తాన్ వార్తా పోర్టల్ ది నేషన్ నివేదిక ప్రకారం.. 2025 ఆసియా కప్‌లో మొహసిన్ నఖ్వి తీసుకున్న కఠిన వైఖరికి గాను ఈ పతకాన్ని అందజేస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం సింధ్, కరాచీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది గులాం అబ్బాస్ జమాద్ పీసీబీ, ఏసీసీ అధ్యక్షుడు నఖ్వికి షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్ ను అందజేస్తామని ప్రకటించారు.

ఆసియా కప్‌లో నిర్భయమైన, సూత్రబద్ధమైన నిర్ణయాలకు కట్టుబడి పాకిస్తాన్‌కు గౌరవం తెచ్చిన నఖ్వికి ఈ పతకాన్ని అందజేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా అజేయంగా నిలిచి ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో పీసీబీ అధిపతి మొహసిన్ నఖ్వి వేదికపై కనిపించారు. ఏసీసీ ప్రస్తుత అధ్యక్షుడు కావడంతో, ట్రోఫీని అందజేయడానికి మొహసిన్ వచ్చారు.

టీమిండియా సభ్యులు మొహసిన్ నుండి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించారు. దీనికి కారణం చెబుతూ మొహసిన్ నఖ్వి పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రి కూడా కావడంతో తాము అతని నుండి ట్రోఫీని తీసుకోలేమని టీమ్ ఇండియా స్పష్టం చేసింది. అయినప్పటికీ, మొహసిన్ నఖ్వి ఏ మాత్రం సిగ్గు లేకుండా వేదికపై నిలబడి, చివరికి ట్రోఫీని తనతో తీసుకెళ్లిపోయారు. ఇది పెద్ద దుమారానికి కారణమైంది. ప్రపంచ క్రికెట్‌లో ఆయన ట్రోఫీ దొంగగా పేరు పొందారు. క్రికెట్ ప్రపంచంలో ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమైనప్పటికీ, పాకిస్తాన్‌లో మాత్రం ధైర్యవంతమైన నిర్ణయాలకు ఆయనను హీరోగా చూసి సన్మానించడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News