England vs Pakistan: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌లో కరోనా కలకలం

England vs Pakistan: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌లో కోవిడ్ కలకలం రేపుతోంది.

Update: 2021-07-06 10:52 GMT

England vs Pakistan: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌లో కరోనా కలకలం

England vs Pakistan: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌లో కోవిడ్ కలకలం రేపుతోంది. ఎల్లుండి నుంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సిన నేపధ్యంలో ఇంగ్లీష్ టీమ్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం ముగ్గురు ఆటగాళ్లు, ముగ్గురు సిబ్బందికి కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్‌తో ఎల్లుండి ప్రారంభం కావాల్సిన వన్డే సిరీస్‌పై సందిగ్ధత ఏర్పడింది.

మరోవైపు ఆటగాళ్లు కోవిడ్ బారిన పడడంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ స్పందించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు ప్రకటించింది. అలాగే, పాకిస్తాన్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ ఎట్టిపరిస్తితుల్లోనూ ఆగదని క్లారిటీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్‌కు ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Tags:    

Similar News