ENG vs NZ 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ENG vs NZ: నేటి నుంచి మొదలు కానున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్ట్‌ సిరీస్‌ లో భాగంగా మొదటి టెస్టులో కివీస్ టాస్ గెలిచింది.

Update: 2021-06-02 11:15 GMT

టాస్‌లో పాల్గొన్న కివీస్, ఇంగ్లండ్ కెప్టెన్‌లు (ఫొటో ట్విట్టర్)

ENG vs NZ 1st Test: నేటి నుంచి మొదలు కానున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్ట్‌ సిరీస్‌ లో భాగంగా మొదటి టెస్టులో కివీస్ టాస్ గెలిచింది. లార్డ్స్‌ వేదికగా జరుతుగున్న ఈ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుంది. అయితే, గాయంతో బాధపడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్.. బరిలోకి దిడగం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కాగా, ఐపీఎల్ ఆడిన ఇంగ్లండ్ ఆటగాళ్లంతా ఈ టెస్ట్‌ మ్యాచ్‌కు దూరమయ్యారు. గాయం మరలా తిరగబెట్టడంతో జోఫ్రా ఆర్చర్ కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక ఇంగ్లండ్ తరఫున ఓలీ రాబిన్సన్, జేమ్స్ బ్రేసీ ఈమ్యాచ్‌లో అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు న్యూజిలాండ్ తరఫున డేవన్ కాన్వే తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. కివీస్ పేస్‌ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్ తో సిరీస్‌ను న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆడనుండడంతో.. మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోనుంది. అలాగే ఇక్కడి నుంచి ఇంగ్లండ్ టీం కూడా బిజీగా మారనుంది. ఇరు జట్లలో టాప్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. దీంత మొదటి టెస్ట్ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగనుందనడంలో సందేహం లేదు. భారత పర్యటనలో వరుస పరాజయాలు పాలైన ఇంగ్లీష్ టీం.. స్వదేశంలోని ఈ టెస్ట్‌ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. అలాగే వరుస విజయాలతో న్యూజిలాండ్.. ఫేవరెట్‌గా బరిలోకి దిగింది.

తుది జట్లు:

ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలీ, జో రూట్(కెప్టెన్), ఓలీ పోప్, డాన్ లారెన్స్, జేమ్స్ బ్రేసీ(కీపర్), ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్

న్యూజిలాండ్: టామ్ లాథమ్, డేవన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బీజే వాట్లింగ్ (కీపర్), కోలిన్ డీ గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నర్, కైల్ జెమీసన్, టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్


Tags:    

Similar News