కేఎల్ రాహుల్‌కు ఏకలవ్య అవార్డ్

Update: 2020-11-03 04:02 GMT

టీమిండియా టీ20 వైఎస్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ను ఏకలవ్య అవార్డు వరించింది. కర్ణాటక ప్రభుత్వం క్రీడల్లో ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం ఏకలవ్య. గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఆటతీరుతో అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న కేఎల్ రాహుల్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. తనకు రాష్ట్ర అత్యున్నత పురస్కారం అందిస్తున్నందుకు కన్నడ సర్కార్‌కు రాహుల్ కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు కోచ్‌లు, జట్టు సభ్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారమే కారణమంటూ ఎమోషనల్ అయ్యాడు. 

Tags:    

Similar News