Delhi Capitals : ఐపీఎల్‌ను వదలని కరోనా.. ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ కి..

Delhi Capitals : ఐపీఎల్‌ను కరోనా ఎదో రకంగా వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా ఢిల్లీ జట్టు లోని అసిస్టెంట్ కోచ్ కి కరోనా సోకింది.. ఈ

Update: 2020-09-07 07:34 GMT

IPL 2020

Delhi Capitals : ఐపీఎల్‌ను కరోనా ఎదో రకంగా వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా ఢిల్లీ జట్టు లోని అసిస్టెంట్ కోచ్ కి కరోనా సోకింది.. ఈ విషయాన్ని ఆ జట్టు ప్రకటించడం విశేషం.. దుబాయ్ నుంచి అతనికి రెండు సార్లు కరోనా పరీక్షలు చేయగా అందులో నెగిటివ్ అని వచ్చిందని కానీ తాజాగా చేసిన పరీక్షలలో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా వెల్లడించింది. అయితే ఈ కోచ్ ని ఆటగాళ్ళు ఎవరు కలవలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్‌కు తరలించినట్టుగా స్పష్టం చేసింది.

ప్రస్తుతం 14 రోజుల పాటు అతడు క్వారంటైన్‌లో ఉంటాడని అప్పుడు మళ్లీ రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తామని అప్పటికి నెగిటివ్ వస్తే జట్టుతో కలుస్తాడని, అతని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికికప్పుడు చెబుతామని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక దీనికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ దిశంత్‌ యగ్నిక్‌ దుబాయ్‌కు రాకముందే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 14 రోజుల అనంతరం అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని వచ్చింది.

ఇక అటు ఐపీఎల్ షెడ్యుల్ వచ్చేసింది. ఈ నెల 19 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా.. ఐపీఎల్ 2020 సీజన్ మూడు వేదికల్లో మొత్తం 53 రోజులు జరగనుండగా.. 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. తోలి మ్యాచ్ ముంబై ఇండియాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అబుదాబి వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 07:30 ని.లకు మ్యాచ్ లు ప్రసారం కానుండగా.. ఓకే రెండు మ్యాచ్ లు ఉన్న సమయంలో మాత్రం మధ్యాహ్నం 3:30ని.లకు ప్రసారమవుతుందని తెలిపింది. 

Tags:    

Similar News