Protest in Croatia: కరోనా వైరస్ అంటించిన నొవాక్‌ జొకోవిచ్‌ చావాలి.. క్రొయేషియాలో నిరసనలు

Protest in Croatia: కరోనా వైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2020-07-01 04:45 GMT
Novak Djokovic (File Photo)

Protest in Croatia: కరోనా వైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కొవిడ్ బారీన పడుతూ వస్తున్నారు. టెన్నిస్‌ స్టార్ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే జొకోవిచ్‌కు మరో చిక్కు వచ్చి పడింది. ఇటీవలే జోకోవిచ్‌తో పాటు అతని కుటుంబానికి కరోనా సోకింది. జోకొవిచ్ భార్య జెలీనాకు కూడా కరోనా పాజిటివ్‌ రాగా వారి పిల్లలకు మాత్రం నెగిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లించాడు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జోకోవిచ్ ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిబిషన్‌ సిరీస్‌ విమర్శలు వచ్చాయి. దీంతో ఈవెంట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. విమర్శకులు, టెన్నిస్‌ వర్గాలు జొకోవిచ్‌ నిర్వాకంపై మండిపడుతున్నారు. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు జరుగుతుండగానే బల్గేరియా ఆటగాడు దిమిత్రోవ్‌, క్రొయేషియా యువ ఆటగాడు బొర్నా చోరిచ్లతో పాటు జోకోవిచ్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌ మార్కో పానిచి కరోనా వైరస్‌ బారీన పడ్డారు. ప్రస్తుత తరుణంలో ఈ టోర్నీలేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జొకోవిచ్‌ సోరీ చెప్పాడు.

అయితే క్రీడా ప్రముఖులు సెర్బియన్‌ స్టార్‌పై ఇంకా క్రొయేషియాలోని స్లిపట్‌ నగరంలో కరోనా అంటించిన జొకోవిచ్‌ చావాలని కోరుకుంటున్నట్లు గోడలపై రాతలు రాశారు. 'జొకో నువ్వు చావాలని స్లిపట్‌ నగరం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది' అని నిరసనకారులు రాశారు. మరోవైపు సెర్బియా మహిళా ప్రధానమంత్రి తమ స్టార్‌ ప్లేయర్‌కు మద్దతుగా నిలిచారు. టోర్నీ నిర్వహణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని జోకోవిచ్ ను నిందించకూడదని కోరారు.


Tags:    

Similar News