Suresh Raina : మా కుటుంబంపై దాడి జరిగింది.. మౌనం వీడిన రైనా!

Suresh Raina : ఈ ఏడాది సీజన్ కి గాను చెన్నై జట్టు నుంచి ఆ జట్టు ఆటగాడు సురేష్ రైనా తప్పుకున్న సంగతి తెలిసిందే.. అయితే సురేష్ రైనా ఎందుకు

Update: 2020-09-01 12:26 GMT

Suresh Raina

Suresh Raina : ఈ ఏడాది సీజన్ కి గాను చెన్నై జట్టు నుంచి ఆ జట్టు ఆటగాడు సురేష్ రైనా తప్పుకున్న సంగతి తెలిసిందే.. అయితే సురేష్ రైనా ఎందుకు తప్పుకున్నాడన్న సంగతి ఎవరికీ తెలియదు.. అయితే దీనిపైన రైనా తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. వ్యక్తిగత కారణాలతోనే యూఏఈ నుంచి బయటకు వచ్చినట్టుగా రైనా అందులో వెల్లడించాడు. పంజాబ్‌లో మా కుటుంబంపై భయంకరమైన దాడి జరిగింది. ఈ ఘటనలో మా అంకుల్‌ను చంపేశారు. మా మేనత్త, నా ఇద్దరు కజిన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇందులో గత రాత్రి నా కజిన్‌ ఒకరు ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందారు.

మా మేనత్త పరిస్థితి విషమంగా ఉంది. నేరానికి పాల్పడిన వారిని విడిచిపెట్టవద్దు అని పంజాబ్‌ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా రైనా వెల్లడించాడు. అంతేకాకుండా పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశాడు. అటు పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో గల రైనా బంధువుల ఇంటిపై ఆగస్ట్ 29న నలుగురు దుండగులు దాడి చేశారు. ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో విరాట్‌ కోహ్లి ఉండగా.. రెండో స్థానంలో రైనా ఉన్నాడు.



CSK ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

చెన్నై టీంలోని ఇద్దరు ఆటగాళ్ళతో సహా 13 మందికి UAEలో చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, తాజాగా చేసిన టెస్టులో వారందరికి నెగిటివ్ అని వచ్చింది. సెప్టెంబర్ 03న మళ్ళీ జరిగే టెస్టుల్లో వారందరికి నెగిటివ్ వస్తే సెప్టెంబర్ 05 నుంచి CSK జట్టు ప్రాక్టిస్ మొదలు పెట్టనుంది. ఇక ఇప్పటికే మిగిలిన జట్లు ప్రాక్టిస్ మొదలు పెట్టేశాయి. 

Tags:    

Similar News