కరోనా ఎఫెక్ట్ : సెల్ఫీలు వద్దు.. రూల్స్ ఫాలో అవ్వండి
టీమిండియాతో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు సోమవారం ఢిల్లీకి చేరుకుంది.
టీమిండియాతో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు సోమవారం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ నుంచి సౌతాఫ్రికా ఆటగాళ్లు నేరుగా ధర్మశాలకు వెళ్లిపోయారు. వారితో పాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మన్‌జ్రా ఉన్నారు. కొవిడ్-19 భారత్‌లోనూ విస్తరిస్తోండటంతో సౌతాఫ్రికా జట్టు తమ వెంట వైద్యుడిని తెచ్చుకుంది. తమ క్రికెటర్లు కరచాలనాలు కూడా చేయరని కోచ్ మార్క్ బౌచర్ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్యం తమ క్రికెటర్లకు కొన్ని జాగ్రత్తలు సూచించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా జట్టు పలు నియమాలు పాటించాలని, అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు, సంభాషణలు చేయకూడదని యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. విదేశాలకు వెళ్లేటప్పుడు క్రికెటర్లకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించామని, అలానే భారత్‌కు వెళ్లేప్పుడు ఈ జాగ్రత్తలు ఇతరులకు కూడా ఉపయోగపడతాయని దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్య వర్గాలు వెల్లడించాయి.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు చేసిన సూచనలు వన్డే సిరీస్‌తో పాటు మార్చి 29 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్‌లోనూ పాటించాలని తెలిపటన్లు సమాచారం. భారత క్రికెటర్లు మాత్రం మంగళవారం ధర్మశాలకు వెళతారు. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ మధ్య మార్చి 12న తొలి వన్డే, మార్చి 15న లఖ్‌నవూ వేదికగా రెండో వన్డే, మార్చి 18న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో ఆఖరి వన్డే ఆడనుంది