CNG Cars: డీజిల్ కార్లను అధిగమించిన సీఎన్‌జీ కార్లు..మైలేజ్ మంత్రంతో అమ్ముడైన 7 లక్షల మోడళ్లు
CNG Cars: భారతదేశంలో ఇప్పుడు ఎక్కువ మైలేజీని ఇచ్చే కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీని ఫలితమే 2025 ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ (CNG) కార్ల అమ్మకాలు తొలిసారిగా డీజిల్ కార్లను (Diesel Cars) అధిగమించాయి.
CNG Cars: డీజిల్ కార్లను అధిగమించిన సీఎన్‌జీ కార్లు..మైలేజ్ మంత్రంతో అమ్ముడైన 7 లక్షల మోడళ్లు
CNG Cars: భారతదేశంలో ఇప్పుడు ఎక్కువ మైలేజీని ఇచ్చే కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీని ఫలితమే 2025 ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ (CNG) కార్ల అమ్మకాలు తొలిసారిగా డీజిల్ కార్లను (Diesel Cars) అధిగమించాయి. గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో 7,87,724 సీఎన్‌జీ కార్లు అమ్ముడవ్వగా, డీజిల్ కార్ల అమ్మకాలు 7,36,508గా నమోదయ్యాయి. ఈ గణాంకాలు దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీదారులను సీఎన్‌జీ విభాగంలో కొత్త కార్లను విడుదల చేయడానికి ప్రోత్సహించవచ్చు.
సీఎన్‌జీ కార్ల అమ్మకాల్లో 35% వృద్ధి
2025 ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ కార్ల అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 35% పెరిగాయి. అయితే డీజిల్ కార్ల అమ్మకాలు 5% పెరగగా, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), హైబ్రిడ్ కార్ల (Hybrid Cars) అమ్మకాలు 15% వృద్ధిని సాధించాయి. అయితే, పెట్రోల్ కార్ల (Petrol Cars) అమ్మకాల్లో 7% తగ్గుదల కనిపించింది. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకుని, గత నాలుగు నెలల్లో అనేక కంపెనీలు సీఎన్‌జీ మోడళ్లను విడుదల చేశాయి: హోండా అమేజ్, ఎలివేట్ కార్లలో సీఎన్‌జీ వేరియంట్‌లను విడుదల చేసింది. రెనాల్ట్ క్విడ్, కైగర్, ట్రైబర్ (Triber) కోసం సీఎన్‌జీ మోడళ్లను ప్రవేశపెట్టింది. సిట్రోయెన్ సీ3 సీఎన్‌జీని, నిస్సాన్ మాగ్నైట్ సీఎన్‌జీని మార్కెట్‌లోకి తెచ్చాయి.
మరిన్ని కంపెనీలు సీఎన్‌జీ రేసులోకి
టాటా మోటార్స్ (Tata Motors) త్వరలో తన కర్వ్ ఎస్‌యూవీ (Curvv SUV) సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా విడుదల చేయనుంది. కియా (Kia) ఈ సంవత్సరం చివరి నాటికి కారెన్స్ సీఎన్‌జీ వెర్షన్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. కియా కారెన్స్ పర్ఫామెన్స్, మైలేజ్ కోసం సీఎన్‌జీ టెక్నాలజీని పరీక్షిస్తోంది.అయితే ఇది ఇతర మోడళ్లకు సీఎన్‌జీ ఎంపికలను విస్తరించడానికి ప్రణాళిక వేయడం లేదు.
ఈ మార్పులతో మారుతి సుజుకి (Maruti Suzuki), హ్యుందాయ్ (Hyundai), టాటా, టయోటా (Toyota), హోండా, కియా, నిస్సాన్, రెనాల్ట్, స్టెల్లాంటిస్ (Stellantis) సహా చాలా కంపెనీలకు సీఎన్‌జీ మోడళ్లు అందుబాటులో ఉంటాయి. అయితే, వోక్స్‌వ్యాగన్ గ్రూప్ (Volkswagen Group), జెఎస్‌డబ్ల్యూ ఎంజీ (JSW MG), మహీంద్రా (Mahindra) వంటి మూడు కంపెనీలు సీఎన్‌జీ రేసులో లేకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
సీఎన్‌జీ అమ్మకాల్లో మారుతి సుజుకి, టాటా మోటార్స్ కీలకం!
మారుతి సుజుకి పెద్ద సీఎన్‌జీ లైనప్, టాటా మోటార్స్ ట్విన్-సిలిండర్ టెక్నాలజీ ఇటీవల జరిగిన ఈ వృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. మారుతి తన దాదాపు అన్ని మోడళ్లలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ ఎంపికలను అందిస్తుంది. టాటా ఆవిష్కరణ ద్వారా ఒక పెద్ద ట్యాంక్‌కు బదులుగా బూట్ ఫ్లోర్ కింద రెండు 30-లీటర్ సీఎన్‌జీ సిలిండర్‌లను ఉంచడం వల్ల సామాను ఉంచుకోవడానికి ఎక్కువ స్థలం లభిస్తుంది. ఇది సాధారణ సీఎన్‌జీ కార్లలో ఉన్న ఒక పెద్ద లోపాన్ని తొలగిస్తుంది. ఈ గణాంకాలు భారతదేశంలో వినియోగదారులు ఇంధన సామర్థ్యం,పర్యావరణ అనుకూల ఎంపికల వైపు మారుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.