IPL 2020: న్యూజెర్సీలో ఏంట్రీ ఇవ్వనున్న చెన్నై సూపర్ కింగ్స్
IPL 2020: యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2020కి రంగం సిద్దమైంది. ఇప్పటికే అన్ని జట్లు అబుదాబికి చేరుకున్నాయి. కరోనా విరామం తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆటకు సిద్దమైంది
Chennai Super Kings (CSK) unveil their official jersey for IPL 2020
IPL 2020: యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2020కి రంగం సిద్దమైంది. ఇప్పటికే అన్ని జట్లు అబుదాబికి చేరుకున్నాయి. కరోనా విరామం తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆటకు సిద్దమైంది. ఈ తరుణంలో కొత్త జెర్సీని ఆ జట్టు ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇందులో కెప్టెన్ ధోనీ, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, బ్రావో కొత్త జెర్సీలతో దర్శనమిచ్చారు. అభిమానులు కొనుక్కోనే విధంగా 7.life వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. దీని ధర రూ.1,999 ఉంటుందని ప్రకటించింది.
అటు వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ ప్రకటించారు. కరోనా కలకలంతో చెన్నై టీంఆటగాళ్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసింది. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో వారందరికి నెగటివ్ వచ్చింది. దీంతో నేడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రాక్టిస్ మొదలు పెట్టనుంది. ఆల్ ది బెస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ అంటూ అన్‌లైన్ వేదికగా అభిమానులు విష్ చేస్తున్నారు.
The #yellove jerseys for the Super King in you! Now available at https://t.co/bz0igILZio 🦁💛 #WhistlePodu @TheSevenLife_ pic.twitter.com/f5CjlRmN3E
— Chennai Super Kings (@ChennaiIPL) September 4, 2020