IPL 2020: అమ్మ కోసమే టోర్నీకి దూరం: భ‌జ్జీ

IPL 2020:  అమ్మ కోసమే టోర్నీకి దూరం: భ‌జ్జీ
x

అమ్మ కోసమే టోర్నీకి దూరం: భ‌జ్జీ

Highlights

IPL 2020: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఉత్స‌హంతో ఎదురుచూస్తున్న‌.. ఐపీఎల్ 2020 దుబాయ్ వేదిక‌గా మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న‌ది. ఈ త‌రుణంలో చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టుకు దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతుంది.

IPL 2020: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఉత్స‌హంతో ఎదురుచూస్తున్న‌.. ఐపీఎల్ 2020 దుబాయ్ వేదిక‌గా మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న‌ది. ఈ త‌రుణంలో చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టుకు దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతుంది. తొలుత జ‌ట్టులో కొంత మంది ఆట‌గాళ్ల‌కు కరోనా సోకడంతో.. క‌ల‌క‌లం రేగింది. అనంత‌రం.. చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో త‌ప్పుకున్నాడు. తాజాగా మ‌రో ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ నుంచి హర్భజన్ సింగ్ తప్పుకున్నాడు.

ఐపీఎల్ -2020లో తాను భాగం కాలేక‌పోతున్నాన‌నీ, వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు తెలిపాడు. గత కొద్ది రోజులుగా హర్భజన్ సింగ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమె చెంత ఉండాలనీ, అమ్మ కోసమే ఈ సీజ‌న్ నుంచి వైదొలిగాననీ, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కుటుంబంతోనే ఉండాలని భావిస్తున్నానని భజ్జీ అన్నాడు. ఈ నిర్ణయాన్ని చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యానికి తెలియజేశానన్నాడు. టోర్నీలో జ‌ట్టు అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్‌ చేశాడు.

టోర్నీకి హర్భజన్ దూర‌మ‌వుతున్న‌డ‌ని ఈ రోజు ఉద‌యం నుంచి సోష‌ల్‌మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అవన్నీ నిజమేనని భజ్జీ సాయంత్రం ట్విటర్‌ ద్వారా ఇలా ధ్రువీకరించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories