Sourav Ganguly on IPL Sponsorship: ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ పై గంగూలీ వ్యాఖలు

Sourav Ganguly on IPL Sponsorship: కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితే ఐపీఎల్‌ నిర్వహణపై అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నామని.

Update: 2020-08-09 09:30 GMT
Sourav Ganguly (File Photo)

Sourav Ganguly on IPL Sponsorship: కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితే ఐపీఎల్‌ నిర్వహణపై అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నామని, దాంతో అన్ని రాష్ట్ర క్రికెట్‌ బోర్డులు సిద్ధంగా ఉండాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గతంలోనే స్పష్టంచ్సారు... దీనికి సంబంధించి రాష్ట్ర అసోసియేషన్‌లకు లేఖ రాసారు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌ను నిర్వహణను పరిశీలిద్దామని లేఖలో ప్రస్తావించారు.

అయితే, గత కొద్ది సంవత్సరాలుగా టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ చేస్తున 'వివో' సంస్థ వైదొలగడంతో ఐపీఎల్‌ 2020 సీజన్ 13 కొత్త స్పాన్సర్‌షిప్‌ కోసం బీసీసీఐ ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే.. స్పాన్సర్‌షిప్‌ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. స్పాన్సర్‌షిప్‌ నుండి వైదొలిగినంత మాత్రాన బోర్డు కు ఎటువంటి నష్టము కలుగదని స్పష్టం చేసారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కుంటామని గంసులీ తెలిపారు. అంతే కాదు, కొన్న పనులు వెంటనే జరగవని, కొన్ని నిర్ణయాలను లాభాలను, మరికొన్ని నష్టాలను తెస్తాయి అని తెలిపారు. అలగే భారత ఆటగాళ్ళు మరియు పాలకులు బీసీసీఐకు ఏంతో బలాన్ని చేకుర్చారని వెల్లడించారు.. 


Tags:    

Similar News