T20 World Cup: భారత్‌లో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణకు నో ఛాన్స్‌

T20 World Cup: యూఏఈలో టోర్నీ నిర్వహించేందుకు సిద్ధమైన బీసీసీఐ * అక్బోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు మ్యాచ్‌లు

Update: 2021-06-27 06:27 GMT

BCCI (Photo The Hans India)

T20 World Cup: భారత్‌లో కరోనా కారణంగా ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరిగే వీలు లేనట్టు కనిపిస్తోంది. దీంతో.. యూఏఈలో టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది. మొత్తం 16 దేశాలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. అబుదాబి, షార్జా, దుబాయ్​వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లకు ఒమన్‌ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ముందుగా.. ఇండియాలోనే టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలని బీసీసీఐ అనుకుంది. కానీ.. టోర్నీ నిర్వహణకు ముఖ్యంగా రెండు సమస్యలు వచ్చిపడ్డాయి. భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి ట్యాక్స్‌ మినహాయింపు లభించలేదు. అలాగే.. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేశారు. దీంతో.. విదేశీ ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరలా ఆటగాళ్లు భారత్‌ వచ్చేందుకు ఒప్పుకుంటారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

భారత్‌లో ప్రపంచకప్‌ నిర్వహిస్తే.. బీసీసీఐ భారీగా ట్యాక్స్‌ పే చేయాల్సి వస్తుంది. అదే.. టోర్నీని ‍‍యూఏఈకి తరలించడం ద్వారా బోర్డుకు వచ్చే ఆదాయంలో దాదాపు 41 శాతం ఆదా కానుందని బీసీసీఐ తెలిపింది. దీంతో యూఏఈకి తరలిస్తేనే మంచిదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ 20 ప్రపంచ కప్ జరగనుంది. దీంతో ఆటగాళ్ల జర్నీకి ఇబ్బందులు ఉండవని బీసీసీఐ భావిస్తోంది.

Tags:    

Similar News