BCCI: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చారిత్రాత్మక మార్పులు.. A+ గ్రేడ్‌కు ముగింపు,రో-కోహ్లీలకు భారీ షాక్!

భారత క్రికెట్‌లో ఒక యుగానికి తెరపడినట్టే కనిపిస్తోంది. 2025–26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

Update: 2026-02-07 06:34 GMT

BCCI: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చారిత్రాత్మక మార్పులు.. A+ గ్రేడ్‌కు ముగింపు,రో-కోహ్లీలకు భారీ షాక్!

భారత క్రికెట్‌లో ఒక యుగానికి తెరపడినట్టే కనిపిస్తోంది. 2025–26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తాజా నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు అగ్రశ్రేణి ఆటగాళ్లకు మాత్రమే కేటాయించిన A+ గ్రేడ్‌ను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై కొత్త కాంట్రాక్ట్ వ్యవస్థను మూడు గ్రూపులకే (A ,B, C) పరిమితం చేసింది. ఈ మార్పులతో భారత క్రికెట్ భవిష్యత్తుపై బీసీసీఐ దృష్టి సారించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ మార్పుల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రూప్ Bకి డిమోట్ చేయడం. అయితే ఇది వారి ప్రతిభప ప్రకారం తీసుకున్న నిర్ణయం కాదని, ప్రస్తుత ఆటలలో వారి భాగస్వామ్యాన్ని బట్టి తీసుకున్న నిర్ణయమని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ టీ20 అంతర్జాతీయాలు, టెస్టులకు దూరంగా ఉన్నారు. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. అందువల్ల అన్ని ఫార్మాట్లలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో పోలిస్తే.. అగ్ర గ్రూప్‌కు అర్హత లేదన్నది బీసీసీఐ అభిప్రాయం.

కొత్త కాంట్రాక్ట్ విధానంలో గ్రూప్ Aనే అత్యున్నత కేటగిరీ. ఈ గ్రూప్‌లో అన్ని ఫార్మాట్లలో కీలక పాత్ర పోషించే ఆటగాళ్లకే చోటు కల్పించారు. ఈ ఎలైట్ జాబితాలో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లు ఉన్నారు. ఇది భవిష్యత్తు నాయకత్వానికి బీసీసీఐ ఇస్తున్న స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రూప్ Bలో సీనియర్లు, యువతకు అవకాశం దక్కింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరందరూ జట్టుకు ప్రస్తుతం కీలకంగా ఉన్న ప్లేయర్స్.

గ్రూప్ Cలో భవిష్యత్తు భారత జట్టు ఉందని చెప్పొచ్చు. అఇందులో క్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాలు పేరు కాదు.. ప్రస్తుత సేవలే ముఖ్యం అని స్పష్టంగా చెబుతున్నాయి. రూ.7 కోట్ల విలువైన A+ గ్రేడ్‌ను తొలగించడం ద్వారా.. బీసీసీఐ వర్క్‌లోడ్, మల్టీ-ఫార్మాట్ లభ్యత, జట్టుకు ప్రస్తుత అవసరం వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.

Tags:    

Similar News