Nahid Rana: తన బౌలింగ్ స్పీడ్ 150+.. టీమిండియాకు ముప్పుగా మారనున్న ఈ 22ఏళ్ల ఆటగాడు ఎవరో తెలుసా ?

Nahid Rana: ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో మ్యాచ్ దుబాయ్‌లో టీం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య నేడు జరగనుంది. సాధారణంగా బంగ్లాదేశ్ జట్టు స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది.

Update: 2025-02-20 06:38 GMT

Nahid Rana: తన బౌలింగ్ స్పీడ్ 150+.. టీమిండియాకు ముప్పుగా మారనున్న ఈ 22ఏళ్ల ఆటగాడు ఎవరో తెలుసా ?

Nahid Rana: ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో మ్యాచ్ దుబాయ్‌లో టీం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య నేడు జరగనుంది. సాధారణంగా బంగ్లాదేశ్ జట్టు స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది. ఫిబ్రవరి 20న మ్యాచ్‌లోకి అడుగుపెట్టే ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో భారత్‌పై గెలుస్తామని నమ్మకంగా ఉన్నారు. దీనికి అతి పెద్ద కారణం 22 ఏళ్ల యువ బౌలర్. అతడే నహిద్ రాణా . తను గంటకు 150కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. దుబాయ్‌లో భారత జట్టుకు అతను అతిపెద్ద ముప్పుగా తనే అని అంటున్నారు.

బంగ్లాదేశ్ జట్టు భారత్ కంటే బలహీనంగా ఉండవచ్చు. కానీ నహిద్ రాణా రూపంలో బంగ్లాదేశ్ దగ్గర ఓ బ్రహ్మాస్త్రం ఉంది. 6 అడుగుల 5 అంగుళాల పొడవున్న రాణా గతేడాదే అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. తన స్పీడ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తరపున అత్యంత వేగవంతమైన బంతిని వేసిన రికార్డు కూడా అతడి పేరు మీదే ఉంది. 152 కిమీ వేగంతో బౌలింగ్ చేసి ఈ ఘనత సాధించాడు. గతేడాది పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రాణా ఈ వేగంతో ఆ దేశ బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు.

దుబాయ్ పిచ్‌పై రాణా ఎత్తు, బౌలింగ్ స్పీడు అతనికి బాగా కలిసొస్తాయి. ఇది అతనికి మరింత బౌన్స్ ఇవ్వవచ్చు. ఇది దుబాయ్‌లో భారత జట్టుకు అతడిని ప్రమాదకరంగా మార్చవచ్చు. అయితే, గతేడాది టెస్ట్ సిరీస్ సందర్భంగా భారత పర్యటనలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులకు 1 వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు. కానీ భారత బ్యాట్స్‌మెన్‌ను మాత్రం ఇబ్బందుల పాలు చేశాడు. ఇప్పుడు దుబాయ్‌లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా ఇతర టీం ఇండియా బ్యాట్స్‌మెన్‌లకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో కూడా భారత జట్టుపై విజయం సాధించి తీరుతామనే కాన్ఫిడెంట్ కు అతడి బౌలింగ్ కారణమని తెలుస్తోంది.

నహిద్ రాణాకు అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేదు. కానీ యువ పేస్ సంచలనంగా దూసుకొచ్చాడు. ఇప్పటివరకు అతను ఆరు టెస్ట్ మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. రాణా 3 వన్డే మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. కానీ లిస్ట్ A లో అతని రికార్డు అద్భుతంగా ఉంది. అతను 13 మ్యాచ్‌ల్లో కేవలం 18.46 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రమాదం గురించి భారత జట్టుకు ఇప్పటికే ప్రణాళికలు రచించింది. 

Tags:    

Similar News