IND vs AUS: మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం

India vs Australia: ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Update: 2023-03-03 05:50 GMT

IND vs AUS: మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం

India vs Australia: ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 76 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 18.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ట్రావిస్ హెడ్ 49 రన్స్ చేయగా.. లబుషెంగె 28 పరుగులు చేశాడు. ఇక ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది ఆస్ట్రేలియా.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలిన భారత్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 197కు ఆలౌట్ చేసింది. దీంతో 88 పరుగులు వెనకబడ్డ భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 163 రన్స్‌ చేసి ఆలౌట్ అయి కంగారూల ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌లో 11 వికెట్లు తీసిన లియాన్.. మురళీధరన్‌ రికార్డును బ్రేక్ చేశాడు. భారత్‌పై అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 

Tags:    

Similar News