AUS vs ENG: మ్యాచ్ గెలవడంలో కీలకంగా మారిన క్యాచ్.. ఆ ప్లేయర్ ఎలా పట్టాడో చూసేయండి
AUS vs ENG: ఛాంపియన్స్ ట్రోపీ రసవత్తరంగా కొనసాగుతుంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. రెండో మ్యాచ్ లో ఇండియా గెలిచింది. వరుసగా మిగతా జట్ల మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి.
AUS vs ENG: మ్యాచ్ గెలవడంలో కీలకంగా మారిన క్యాచ్.. ఆ ప్లేయర్ ఎలా పట్టాడో చూసేయండి
AUS vs ENG: ఛాంపియన్స్ ట్రోపీ రసవత్తరంగా కొనసాగుతుంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. రెండో మ్యాచ్ లో ఇండియా గెలిచింది. వరుసగా మిగతా జట్ల మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నో వింతలు, విశేషాలు మ్యాచ్ సమయంలో వైరల్ అవుతున్నాయి. అలాంటిదే అలెక్స్ కారీ గాల్లోకి ఎగిరి పట్టిన క్యాచ్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఫిల్ సాల్ట్ బెన్ బ్యాటింగుకు దిగిన వెంటనే వెనుదిరగాల్సి వచ్చింది. సాల్ట్ ఇంగ్లాండ్‌కు మంచి ఓపెనింగ్ ఇస్తాడని అంతా భావించారు. కానీ అలెక్స్ కారీ అలా చేయకుండా అడ్డుకున్నాడు.
ఇంగ్లాండ్ తరఫున ఫిల్ సాల్ట్ మంచి ఆరంభాన్ని అయితే ఇచ్చాడు. అతను ఒక సిక్స్, ఒక ఫోర్ తో 10 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత అలెక్స్ కారీ తన ప్రయత్నాలను తిప్పికొట్టాడు. ఇన్నింగ్స్‌లోని రెండవ ఓవర్‌లోని నాల్గవ బంతికి ఫిల్ సాల్ట్ ఒక పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నించి దొరికిపోయాడు. ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ కారీ గాల్లోకి దూకి ఫిల్ సాల్ట్ కొట్టిన బంతిని ఒక చేత్తో పట్టుకున్నాడు. ఆ క్యారీ క్యాచ్ ఎంతగా ఉందంటే అందరూ దానిని చూసి ఆశ్చర్యపోయారు. అందరి కళ్ళు బాగా ఓపెన్ చేసి చూసేలా ఉంది. సాల్ట్ కూడా తను క్యాచ్ పడతాడని నమ్మలేకపోయాడు. కానీ 10 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ బాటపట్టాడు. ఈ విధంగా ఇంగ్లాండ్ జట్టు మొదటి ఎదురుదెబ్బను చవిచూసింది.
ఫిల్ సాల్ట్ అవుట్ అయినప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 13 పరుగులు.. అందులో 10 పరుగులు అతడివే. దీని తర్వాత స్కోరు 50 పరుగులకు చేరుకుంటుండగా, ఇంగ్లాండ్‌కు రెండో దెబ్బ తగిలింది. ఈసారి జేమీ స్మిత్ అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టుకు మొదటి రెండు ఎదురుదెబ్బలు 50 పరుగుల లోపే తగిలాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. ఈ టోర్నమెంట్‌లో రెండు జట్ల మధ్య ఇది ఆరో మ్యాచ్. దీనికి ముందు ఆడిన 5 మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ 3 గెలిచింది.. ఆస్ట్రేలియా 2 గెలిచింది.