Asia Cup 2025 schedule: ఆసియా కప్ 2025 షెడ్యూల్ ఖరారు.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై భారీ ఆసక్తి

Asia Cup 2025 schedule: క్రికెట్ అభిమానులెవరికైనా శుభవార్తే. ఆసియా కప్ 2025కు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మరియు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తుదీ నిర్ణయం ప్రకటించారు.

Update: 2025-07-26 13:19 GMT

Asia Cup 2025 schedule: ఆసియా కప్ 2025 షెడ్యూల్ ఖరారు.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై భారీ ఆసక్తి

Asia Cup 2025 schedule: క్రికెట్ అభిమానులెవరికైనా శుభవార్తే. ఆసియా కప్ 2025కు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మరియు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తుదీ నిర్ణయం ప్రకటించారు. ఈ మేరకు ఆసియా కప్ టోర్నీ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరగనున్నట్టు తెలిపారు.




 


మొత్తం ఎనిమిది జట్లు – 19 మ్యాచ్‌లు

ఈసారి ఆసియా కప్‌ను T20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. వీటిలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ, హాంకాంగ్, ఒమన్‌లు ఉన్నాయి. టోర్నీ మొత్తంగా 19 మ్యాచ్‌లు ఉండనున్నాయని సమాచారం.

భారత్ – పాక్ భారీ కాంపిటిషన్

భారతదేశం – పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో కనీసం మూడు సార్లు ఈ జట్ల మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. లీగ్ దశలో ఒకసారి, గ్రూప్ 4 స్టేజ్‌లో మరోసారి, ఫైనల్‌కు చేరితే మూడోసారి తలపడే ఛాన్స్ ఉంటుంది.

యూఏఈ వేదిక ఎంపికపై కారణాలు

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్తాన్ మధ్య వాతావరణం ఉద్రిక్తతగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్‌లో మ్యాచ్‌లకు BCCI అంగీకరించలేదు. అందుకే తటస్థ వేదికగా యూఏఈను ఎంచుకున్నారు. అయితే టోర్నీపై ఆతిథ్య హక్కులు మాత్రం భారత్‌కే ఉంటాయి.

టీ20 ప్రపంచకప్‌కు రిహర్సల్‌గా

2026 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ఇది ఓ రిహర్సల్ కానుంది. ఆ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా, ఆసియా కప్ 2025ను భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గత ఏడాది (2023) కూడా టీమిండియానే టైటిల్ గెలుచుకుంది.

భారత్ – పాక్ మ్యాచ్ తేదీ ఎప్పుడంటే..?

ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన తేదీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. పూర్తి షెడ్యూల్ త్వరలోనే ACC విడుదల చేయనుంది.


Tags:    

Similar News