Ambati Rayudu: రైనా స్థానంలో రాయుడు..!?

Ambati Rayudu: ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 ఇంకో వారం రోజుల్లో ప్రారంభం కానున్న‌ది. దీంతో అన్ని జ‌ట్టు ఐపీఎల్ స‌మ‌రానికి సై అంటున్నాయి

Update: 2020-09-12 07:19 GMT

Ambati Rayudu

Ambati Rayudu: ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 ఇంకో వారం రోజుల్లో ప్రారంభం కానున్న‌ది. దీంతో అన్ని జ‌ట్టు ఐపీఎల్ స‌మ‌రానికి సై అంటున్నాయి. కానీ చెన్నై సూప‌ర్ కింగ్స్ మాత్రం ఆట‌గాళ్లను వెతికెలో ప‌డింది. ఐపీఎల్‌ నుంచి సీఎస్‌కే స్టార్ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా అనూహ్యంగా త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇత‌ని స్థానంలో ప‌లువురు ఆట‌గాళ్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఇప్పుడు తెలుగు తేజం అంబ‌టి రాయుడు వెలుగులోకి వ‌చ్చారు. సురేశ్ రైనా స్థానాన్నిఅంబటి రాయుడుతో భర్తీ చేయాలని న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టయిరిస్‌ అభిప్రాయపడ్డాడు.

మూడో స్థానంలో ఆడించడానికి జట్టుకు అనేక అవకాశాలున్నాయి. ఇద్దరు విదేశీ ఆటగాళ్లు తొలి రెండు స్థానాల్లో ఆడుతున్నప్పుడు పంచ్ హిట్టర్‌గా యువకుడైన గయక్వాడ్ రుతురాజ్‌‌ని మూడో స్థానంలో ఆడించాలని కూడా వారు భావిస్తూ ఉండవచ్చు. పైగా రవీంద్ర జడేజాను కూడా ఆ స్థానంలో ఆడించే అవకాశం ఉంది. జడేజా ఎంత విధ్వంసకర ఆటగాడో అందరికీ తెలుసు. కానీ జట్టులో 3వ స్థానానికి అంబటిరాయుడిని ఎంపిక చేస్తేనే బాగుంటుందని వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను అని స్కాట్ తెలిపాడు.

సురేష్ రైనా, హర్బజన్ సింగ్ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టుకు దూరంకావడంతో ఆందోళన చెందుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు తుది ఎంపికలో అంబటి రాయుడే సరైన సమాధానం అవుతాడని స్కాట్ స్టైరిష్ నొక్కి చెప్పాడు.మూడో రౌండ్ కరోనా టెస్టులను గతవారం ముగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎట్టకేలకు మైదానంలో అడుగుపెట్టింది. ఈ దఫా ఐపీఎల్‌లో చివరగా శిక్షణ కోసం మైదానంలో అడుగుపెట్టిన జట్టు సీఎస్కేనే కావడం విశేషం.

కాగా 13వ ఎడిషన్ ఐపీఎల్ పోటీలు సెప్టెంబర్ 19న మొదలై, నవంబర్ 10న ముగియనున్నాయి. యూఏఈలోని మూడు వేదికల్లో (అబుదుబాయ్, షార్జా, దుబాయ్) ఐపీఎల్ పోటీలు జరుగనున్నాయి.

Tags:    

Similar News