IPL 2020: ఈ సారి టైటిల్ వారికే : బ్రెట్ లీ

IPL 2020: ఈ సారి టైటిల్ వారికే : బ్రెట్ లీ
x

Brett Lee 

Highlights

IPL 2020: యూఏఈ లో జ‌రుగ‌నున్న ఐపీఎల్ 2020 సీజన్‌‌కు సర్వం సిద్ధమవుతోంది. మరో 9 రోజుల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌ల మ‌ధ్య జ‌రుగ‌నున్న ర‌స‌వ‌త్త‌ర పోరుతో లీగ్ ప్రారంభం కానున్న‌ది.

IPL 2020: యూఏఈ లో జ‌రుగ‌నున్న ఐపీఎల్ 2020 సీజన్‌‌కు సర్వం సిద్ధమవుతోంది. మరో 9 రోజుల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌ల మ‌ధ్య జ‌రుగ‌నున్న ర‌స‌వ‌త్త‌ర పోరుతో లీగ్ ప్రారంభం కానున్న‌ది. టైటిల్ సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా అన్ని జ‌ట్టు బ‌రిలో దిగుతున్నాయి.

ఈ త‌రుణంలో.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అభిమానుల‌తో ఆయ‌న ఆస‌క్తిక‌ర ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంటుందని, ముంబై ఇండియన్స్ కెప్టెన్, ప‌రుగుల వీరుడు రోహిత్ శర్మ పరుగుల సునామీని సృష్టిస్తాడని అన్నారు. ఈ సీజ‌న్‌లో ఐపీఎల్‌ ‌ కవరేజ్‌లో భాగంగా అధికారిక బ్రాడ్‌కాస్టర్స్‌ స్టార్ స్పోర్ట్స్‌కు హోస్ట్‌గా బ్రెట్‌ లీ వ్యవహరించనున్నారు. ఇందుకోసం ఆయన ముంబై చేరుకున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో క్వారంటైన్ పాటిస్తున్నాడు.

ఈ తరుణంలో ‌ఆయ‌న 'గాయ్స్.. ఐసోలేషన్‌లో చిక్కుకుపోయా.. ఆసక్తికరమైన ప్రశ్నలేమైనా అడగండి'అని అభిమానులను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిట్‌చాట్‌కు ఆహ్వానించాడు. ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు బ్రెట్‌లీ సమాధానమిచ్చాడు. ఈ చిట్‌చాట్‌లో భాగంగా ఓ అభిమాని 'బ్రెట్ లీ సర్.. ఐపీఎల్ 2020 చాంపియన్‌గా ఏ జట్టు నిలుస్తుంది?'అని ప్రశ్నించాడు. విజేతను చెప్పడం కష్టమే అయినా తాను మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టే టైటిల్‌ గెలుస్తుందని అనుకుంటున్నానని బదులిచ్చాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories