Ind vs Ban 1st-Test Day 2 : గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ల సరసన నిలిచిన రహానే

Update: 2019-11-15 09:59 GMT
Ajinkya Rahane

ఇండోర్ వేదికగా తొలి టెస్టు రెండో రోజు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా క్రికెటర్ రహానే అరుదైన ఘనత సాధించాడు. రహానే 104 ఇన్నింగ్స్‌ల్లో 4వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్న 16వ భారత క్రికెటర్ గా జాబితాలో స్థానం సంపాధించాడు. దీంతో భారత మాజీ క్రికెటర్లు సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ల సరసన రహానే నిలిచాడు. గంగూలీ, లక్ష్మణ్ కూడా 104 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించారు. బంగ్లాదేశ్ పై మూడో ఆర్థ శతనం నమోదు చేశాడు. రహానే (86పరుగులు172 బంతుల్లో 9 ఫోర్లు) ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 347/4 తో ఉంది భారత ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (178 పరుగులు 281బంతుల్లో 23ఫోర్లు 4సిక్సుల ) అజేయంగా నిలిచాడు. మయాంక్‌ అగర్వాల్‌ తోపాటు జాడేజా (10)పరుగులతో రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లతో జాయేద్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు కెప్టెన్ డకౌట్ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది రెండో డకౌట్.

Tags:    

Similar News