Siraj Zanai Bhosle: సింగర్ గా మారిన సిరాజ్.. స్టార్ సింగర్ తో కలిసి పాట పాడిన క్రికెటర్..వీడియో వైరల్
Siraj Zanai Bhosle: టిమిండియా స్టార్ క్రికెటర్ హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతను ఓ అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇదెలా ఉండగా తాజాగా అతను లెజెండరీ సింగర్ ఆశాభోస్లే మనవరాలు జనై భోంస్లేతో కలిసి డ్యూయెట్ సాంగ్ పాడాడు. జనై భోంస్లేతో కలిసి సిరాజ్ రాగం అందుకున్నాడు. జనై భోస్లే తాజా మ్యూజిక్ ఆల్బమ్ లోని కెహందీ హై పాటను వీరిద్దరూ కలిసి పాడారు. ఈ వీడియోను ఈమధ్యే సిరాజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇది ఇంటర్నేషనల్ లో వైరల్ అవుతోంది. సిరాజ్ మల్టీ టాలెంటెడ్, డీఎస్పీ సిరాజ్ ఇకపై సింగర్ కూడా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే జనై భోంస్లేతో క్రికెటర్ సిరాజ్ ప్రేమలో ఉన్నట్లు ఈమధ్య సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ముంబై బాంద్రాలో జరిగిన ఆమె పుట్టిరోజు వేడుకలకు సిరాజ్ హాజరయ్యాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే సిరాజ్ స్పందిస్తూ ఆమె తనకు చెల్లెలు లాంటిదని క్లారిటీ ఇచ్చాడు.