Vasant Panchami 2026: వసంత పంచమి 2026 .. అక్షరాభ్యాసానికి శుభ ముహూర్తం ఇదే!
Vasant Panchami 2026: వసంత పంచమి 2026 రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి శుభ ముహూర్తం ఏ సమయమో తెలుసుకోండి. సరస్వతి జయంతి ప్రత్యేకతలు ఇక్కడ.
Vasant Panchami 2026: వసంత పంచమి 2026 .. అక్షరాభ్యాసానికి శుభ ముహూర్తం ఇదే!
Vasant Panchami 2026: వసంత పంచమి అంటే సరస్వతి దేవి పూజతో పాటు అక్షరాభ్యాసం గుర్తుకు వస్తుంది. 2026లో వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున చదువు ప్రారంభిస్తే పిల్లలు విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉంది.
వసంత పంచమి అనేది జ్ఞాన దేవత సరస్వతి దేవి జయంతి కావడంతో పాటు వసంత రుతువు ఆరంభం కూడా. అందుకే విద్యాభ్యాసం ప్రారంభానికి ఇది ఉత్తమ దినంగా భావిస్తారు. ఈ సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పుస్తకాలు, పెన్నులు, బలపాలు వంటి విద్యాసంబంధిత వస్తువులను దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
పండితుల లెక్కల ప్రకారం, జనవరి 23వ తేదీ శుక్రవారం రోజంతా పంచమి తిథి ఉంటుంది. ఈ రోజున ఉదయం 7.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.33 గంటల వరకు అక్షరాభ్యాసానికి శుభ ముహూర్తమని తెలిపారు. అయితే ఉదయం 10.54 నుంచి మధ్యాహ్నం 12.19 వరకు రాహుకాలం, ఉదయం 8.55 నుంచి 9.41 వరకు దుర్ముహూర్తం ఉండటంతో వాటిని తప్పించుకుని అక్షరాభ్యాసం చేయించడం మంచిదని సూచిస్తున్నారు.
ఈ శుభ సమయంలో సరస్వతి పూజ, అక్షరాభ్యాసంతో పాటు నూతన వ్యాపారాలు, గృహప్రవేశాలు, అన్నప్రాసన వంటి కార్యక్రమాలకు కూడా అనుకూలంగా ఉంటుందని పండితులు పేర్కొన్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ముహూర్తాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నందున, స్థానిక పండితుల సలహా తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.