Mahashivratri Fasting Rules 2026: మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా? ఏవి తింటే పుణ్యం.. ఏవి తింటే దోషం? పూర్తి వివరాలు ఇవే!
Mahashivratri Fasting Rules 2026: మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండటం అనేది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, అది మనసును పరమశివునికి అంకితం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అని పలువురు ఆధ్యాత్మి వేత్తలు చెబుతున్నారు.
Mahashivratri Fasting Rules 2026: మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా? ఏవి తింటే పుణ్యం.. ఏవి తింటే దోషం? పూర్తి వివరాలు ఇవే!
Mahashivratri Fasting Rules 2026: మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండటం అనేది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, అది మనసును పరమశివునికి అంకితం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అని పలువురు ఆధ్యాత్మి వేత్తలు చెబుతున్నారు. ఈ స్పెషల్ స్టోరీలో ఉపవాస సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఉపవాసం ఉండేవారు ఏయే పదార్థాలు తీసుకోవాలో, అలాగే ఉపవాస నియమాలు ఏంటో తెలుసుకుందాం.
మహాశివరాత్రి ఉపవాస నియమాలు..
* ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించండి. తరువాత, ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి.
* శివలింగానికి నీరు, పాలు, బిల్వ పత్రం, ధాతుర, పండ్లు సమర్పించండి. ప్రశాంతమైన మనస్సుతో మంత్రాలను జపిస్తూ ధ్యానం చేయండి.
* కోపం, అబద్ధాలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.
* ఎవరినీ అవమానించవద్దు.
* ఉపవాసం సమయంలో మనస్సు, శరీరం రెండింటి స్వచ్ఛత అవసరమని భావిస్తారు.
* మరుసటి రోజు, శుభ సమయంలో ఉపవాసం ముగించి, ముందుగా దేవునికి ఆహారం నైవేద్యం పెట్టండి.
ఉపవాసం టైంలో ఏమి తినాలి? ఏవి తినకూడదు..
ఉపవాసం చేసే వారు తమ శారీరక శక్తిని బట్టి మూడు రకాలుగా దీక్షను పాటించవచ్చు:
* రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉండటం (ఆరోగ్యం సహకరించే వారు మాత్రమే చేయాలి).
* పండ్లు, పాలు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం.
* పగలు ఉపవాసం ఉండి, రాత్రి పూజ తర్వాత సాత్విక ఆహారం తీసుకోవడం.
ఏమి తినవచ్చు? (ఉపవాసంలో అనుమతించినవి)
ఉపవాస సమయంలో నీరసం రాకుండా ఉండటానికి ఈ క్రింది సాత్విక ఆహారాలను తీసుకోవచ్చని శాస్త్రం చెబుతుంది:
* అరటిపండు, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
* పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్, నెయ్యి. శివునికి ప్రీతికరమైన పాలు మీ కడుపును నిండుగా ఉంచుతాయి.
* బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఖర్జూరం. ఇవి రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి.
* ద్రవ పదార్థాలు: కొబ్బరి నీళ్లు, నిమ్మరసం (ఉప్పు లేకుండా), మజ్జిగ, హెర్బల్ టీ. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి.
* చాలా మంది సగ్గుబియ్యం కిచిడి లేదా ఉడికించిన బంగాళదుంపలను (కారం లేకుండా) తీసుకుంటారు.
వీటికి దూరంగా ఉండండి..
శివరాత్రి పర్వదినాన కొన్ని పదార్థాలను తీసుకోవడం శాస్త్రరీత్యా, ఆరోగ్యరీత్యా నిషిద్ధం. అవి ఏమిటంటే..
* బియ్యం, గోధుమలు, పప్పులు, మైదా, మొక్కజొన్న వంటి ధాన్యాలను అస్సలు తీసుకోకూడదు.
* ఇవి తామసిక గుణాన్ని పెంచుతాయి కాబట్టి ఉపవాస సమయంలో వీటికి దూరంగా ఉండాలి.
* ఐయోడైజ్డ్ సాల్ట్ కూడా వాడకూడదు.
* ఘాటైన మసాలాలు, ఎర్ర మిరపకాయలు, వేయించిన ఆహార పదార్థాలు కడుపులో మంటను కలిగిస్తాయి.
* మాంసాహారం, మద్యపానం పూర్తిగా నిషిద్ధం.
శాస్త్రోక్తంగా ఉపవాసం ఉండి, భక్తితో శివనామ స్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేసి, అందరూ క్షేమంగా శివయ్య అనుగ్రహం పొందేలా చేయండి. ఓం నమః శివాయ.