Vastu Tips: ఇంట్లో డబ్బులు ఎక్కడ దాస్తున్నారు.? ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి

Vastu Tips: డబ్బు మన జీవితంలో చాలా కీలకం. రోజువారీ అవసరాలు నుంచి భవిష్యత్తు భద్రత వరకు ప్రతి విషయం కూడా ధనంపై ఆధారపడుతుంది. అందుకే సంపాదించిన డబ్బు నిలకడగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Update: 2026-03-27 10:26 GMT

Vastu Tips: ఇంట్లో డబ్బులు ఎక్కడ దాస్తున్నారు.? ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి

Vastu Tips: డబ్బు మన జీవితంలో చాలా కీలకం. రోజువారీ అవసరాలు నుంచి భవిష్యత్తు భద్రత వరకు ప్రతి విషయం కూడా ధనంపై ఆధారపడుతుంది. అందుకే సంపాదించిన డబ్బు నిలకడగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బు నిల్వ చేసే ప్రదేశం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతారు.

ఇంట్లో బీరువా స్థానం ఎందుకు ముఖ్యమని చెబుతారు?

వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువుకూ ఒక నిర్దిష్ట స్థానం ఉండాలి అని భావిస్తారు. డ‌బ్బులు, బంగారం వంటివి పెట్టుకునే బీరువా కూడా దీనికి మినహాయింపు కాదు. బీరువా సరైన ప్రదేశంలో ఉంటే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, సంపద నిలకడగా ఉంటుందని నమ్మకం. అందుకే బీరువాను ఎక్కడ ఉంచాలి, అది ఏ దిశగా తెరుచుకోవాలి అనే విషయాలను చాలా మంది పరిగణలోకి తీసుకుంటారు.

ఉత్తరం, తూర్పు దిశలు ఎందుకు శుభప్రదం?

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉత్తర దిశ ధనానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే బీరువాను ఈ దిశలో ఉంచితే మంచిదని చెబుతారు. ఇలా ఉంచితే బీరువా తలుపు సాధారణంగా దక్షిణం వైపు తెరుచుకుంటుంది. ఇది ధన ప్రవాహం ఇంట్లోకి వస్తుందని నమ్మకం.

అలాగే తూర్పు దిశలో బీరువా ఉంచడం కూడా అనుకూలమే అని అంటారు. ఈ దిశలో ఉంచినప్పుడు బీరువా పడమర వైపు తెరుచుకుంటుంది. ఇది కూడా ఆర్థిక శ్రేయస్సుకు అనుకూలంగా ఉంటుందని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.

ఈ దిశల్లో బీరువా ఉంచకూడదని సూచన

వాస్తు ప్రకారం పడమర లేదా దక్షిణ దిశల్లో బీరువా ఉంచడం మంచిది కాదని కొందరు నిపుణులు చెబుతారు. ఈ దిశల్లో ఉంచితే బీరువా తెరుచుకునే దిశ వల్ల సంపద నిలకడగా ఉండకపోవచ్చని భావిస్తారు. అందుకే ఇంట్లో బీరువా స్థానాన్ని నిర్ణయించే ముందు ఈ అంశాన్ని కూడా పరిశీలించాలని సూచిస్తారు.

బీరువా ఉంచే సమయంలో పాటించాల్సిన ఇతర సూచనలు

వాస్తు ప్రకారం బీరువాను ఇంటి గోడకు ఆనించి ఉంచడం మంచిదని చెబుతారు. ముఖ్యంగా ఇంటి నైరుతి మూల (దక్షిణం–పడమర మధ్య ప్రాంతం)లో ఉంచి, బీరువా ముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలని సూచిస్తారు.

ఇంకా కొన్ని సూచనలు

బీరువా నేరుగా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. బాత్రూమ్ లేదా టాయిలెట్‌కు ఆనుకుని ఉన్న గోడకు బీరువా పెట్టకూడద. మెట్ల కింద లేదా బీమ్ కింద బీరువా ఉంచకూడదు. వాస్తు నమ్మకాల ప్రకారం బీరువా పూర్తిగా ఖాళీగా ఉండకూడదు. కనీసం కొంత నగదు లేదా విలువైన వస్తువులు ఉండేలా చూసుకోవాలని అంటారు. అలాగే బీరువాలో లక్ష్మీదేవి చిత్రం, శ్రీయంత్రం లేదా కుబేర యంత్రం ఉంచడం కూడా శుభప్రదంగా భావిస్తారు. పాత బిల్లులు, పనికిరాని వస్తువులు లేదా చెత్త లాంటివి బీరువాలో ఉంచకూడదని సూచిస్తారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు వాస్తు శాస్త్రానికి సంబంధించిన విశ్వాసాలు, కొంత మంది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వ‌డ‌మైంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Tags:    

Similar News